భర్త మరో స్త్రీతో కాస్త చనువుగా ఉన్నా భార్య సహించలేదు. అలాంటిది ఇక ప్రేమ, వివాహేతర సంబంధం వంటి బంధాల గురించి తెలిస్తే.. ఇక ఆ కాపురం ముక్కలవ్వడమే కాక.. బతుకు బజారు పాలవుతుంది. అటు భార్యలు పరాయి మగాడితో మాట్లాడినా సరే అనుమానించి.. నిత్యం నరకం చూపించే మగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ప్రసుత్త కాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇలాంటి అనైతిక సంబంధాలు నెరిపే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భార్త హిజ్రాను ప్రేమించినట్లు తెలుసుకున్న భార్య.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అతడి మనసు అర్థం చేసుకున్న భార్య.. అతడు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించడమే కాక.. దగ్గరుండి మరీ పెళ్లి చేసింది. ఈ సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఒడిషా, కలహండి జిల్ల నర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డోర్‌కుట్ గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నేళ్లు సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఓ హిజ్రా రాకతో కల్లోలం రేగింది. ఏడాది క్రితం ఫకీర్ నియాల్‌కు అదే గ్రామానికి చెందని హిజ్రా సంగీతతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. సంగీతను వదిలి ఉండలేని స్థితికి వచ్చాడు ఫకీర్.
ఇక వీరి ప్రేమ వ్యవహారం గురించి ఫకీర్ భార్యకు కూడా తెలిసింది. తొలుత ఆమె ఎంతో బాధపడింది. దీని గురించి భర్తను నిలదీసింది. కుమారుడి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించింది. కానీ ఫకీర్ మాత్రం.. తనకు సంగీత అంటే ఇష్టమని.. ఆమెను వదిలి ఉండలేనని స్పష్టం చేశాడు. ఇక చేసేదేం లేక ఫకీర్ భార్య.. సంచలన నిర్ణయం తీసుకుంది. సంగీతతో మాట్లాడింది.. తన భర్తను పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉందా అని ప్రశ్నించింది. అందుకు సంగీత ఫకీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పడంతో.. వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంది ఫకీర్ భార్య.
ఈ క్రమంలో ఆదివారం గ్రామంలోని ఆలయంలో.. బంధు మిత్రలు సమక్షంలో సంప్రదాయబద్దంగా ఫకీర్-సంగీతల వివాహాన్ని జరిపించింది అతడి భార్య. దగ్గరుండి వివాహ తంతు పూర్తి చేయించింది. ఫకీర్ భార్య నిర్ణయం గురించి తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదెక్కడి విడ్డూరం అని విస్తుపోయారు. కానీ మరికొందరు మాత్రం.. భర్త తనను ప్రేమించడం లేదని తెలిసినప్పడు.. అతడితో ఉండి.. బాధపడి.. ఆఖరికి ఏ దారుణ సంఘటనో చోటు చేసుకునే బదులు.. ఇలా విడిపోవడం మంచింది. ఇద్దరూ ప్రశాంతంగా ఉంటారు అంటూ ఫకీర్ భార్య తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ.. ‘‘నేను ఫకీర్‌ను ప్రేమించాను.. ఆయన భార్య మంచి మనసుతో నాకు కొత్త జీవితం ప్రసాదించింది. ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉంది. జీవితాంతం ఫకీర్ భార్యకు రుణపడి ఉంటాను’’ అని వెల్లడించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.