ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలకడం.. ఆ తర్వాత మోసం చేసి ముఖం తిప్పుకోవడం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా మోసం చేసేవారిలో ఆడా, మగా అనే తేడా లేకుండా పోతుంది. అయితే సామాన్యులే అనుకుంటే ఇలా మోసం చేసేవారిలో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఎమ్మెల్యే ఒకరు తనను మోసం చేశారని.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ.. ఓ యువతి కోర్టును ఆశ్రయించింది. దాంతో సదరు ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులును ఆదేశించింది. ఆ వివరాలు..
ఒడిశా బిజూ జనతాదళ్ అభ్యర్థి, తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిజయ్‌శంకర్ దాస్.. తనను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ.. సోమాలికా దాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బిజయ్‌శంకర్ దాస్.. తనను పెళ్లి చేసుకుంటానని జగత్‌సింగ్‌పూర్ రిజిస్ట్రార్ ఆఫీసులో.. వివాహానికి కావాల్సిన అన్ని సిద్ధం చేసి.. ఆఖరి నిమిషంలో కానరాకుండా వెళ్లిపోయి తనను మోసం చేశాడని.. గతంలో తన మీద అత్యాచారం చేశాడని కూడా ఆరోపించింది. దీనిపై సుమారు ఏడాది క్రితమే అనగా 2022, మే 13 సోమాలిక్ దాస్ జగత్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాడానికి వెళ్లింది. బిజయ్‌శంకర్ మీద కేసు నమోదు చేయమని కోరింది. కానీ పోలీసులు నిరాకరించారు.
దాంతో సోమాలికా.. ఒడిశా హైకోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. నిందిత ఎమ్మెల్యే బిజయ్‌శంకర్ దాస్‌కి వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బిజయ్‌శంకర్ దాస్‌పై కేసు నమోదు చేస్తామని జగత్‌సింగ్‌పూర్ పోలీసులు వెల్లడించారు. అంతేకాక బిజయ్‌శంకర్ తన ఎన్నికల ఖర్చు కోసం డబ్బు సమకూర్చుకోవడానికి సెక్స్ రాకెట్లు నిర్వహిస్తున్నాడని సోమాలికి ఆరోపించింది. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు బిజయ్‌శంకర్‌పై కేసు నమోదు చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.