ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాలు.. వైరల్ న్యూస్‌కి అడ్డగా మారాయి. కావాలని చేస్తున్నారో లేక.. వైరల్ కావడానికి చేస్తున్నారో తెలియదు కానీ.. పెళ్లి మండపం వేదికగా వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబోయే భర్త తాగుబోతు అని, చదువురాని వాడని తెలిసి.. పీటల మీద పెళ్లిని ఆపేసిన సంఘటనలు చూశాం. మరి కొన్ని చోట్ల.. లాస్ట్ మినిట్‌లో పెళ్లి కొడుకు మారిన సంఘటనలు చూశాం. ఇక పెళ్లి కాకముందు.. అయిన తరువాత కొందరు యువతులు సర్ప్రైజ్‌ల పేరుతో చేసిన దారుణాలను చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన మాత్రం వేరే లెవల్. ఏంటంటే.. మరి కాసేపట్లో వివాహం పూర్తవుతుంది. ఇంతలో పెళ్లి కుమార్తె.. కాబోయే భర్తకి షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె మాటలు విన్న వరుడు పెళ్లి పీటల మీదే స్పృహ తప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఒడిశా, బాలాసోర్ జిల్లా.. రేము గ్రామంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన యువతీ, యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. పెళ్లి పనులన్ని సవ్యంగా సాగుతున్నాయి. మరి కొన్ని నిమిషాల్లో వరుడు.. వధువు మెడలో తాళి కడితే.. వివాహ తంతు పూర్తిగా ముగుస్తుంది. కానీ ఇక్కడే వధువు.. పెళ్లి కుమారుడితో పాటు వచ్చిన వారికి భారీ షాక్ ఇచ్చింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని తెలిపింది. అంతేకాక తనకు అంతకు ముందే మరో వ్యక్తితో వివాహం అయ్యిందని వెల్లడించింది. మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తి కాబోతుంది అని సంతోషంలో ఉన్న వరుడు.. ఈ మాటలు విని షాక్ తిన్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి పీటల మీదే స్పృహ తప్పి పడిపోయాడు.
ఇది కూడా చదవండి: Uttarakhand: కుమారుడిని వివాహం చేసుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త!
ఇక వివాహానికి హాజరైన వారంతా వధువు చేసిన పనికి బిత్తరపోయారు. ఆమె తల్లిండ్రులయితే.. అందరి ముందు తమ పరువు తీసిందని.. పెళ్లి కుమార్తెపై దాడి చేశారు. కొట్టినా, తిట్టినా తాను ఈ పెళ్లి చేసుకునేది లేదని వధువు తేల్చి చెప్పింది. చేసేదేం లేక వచ్చిన వారంతా తిరుగు పయనమయ్యారు. పెళ్లి కుమారుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు తెలిపారు బంధువులు. ఈ వీడియో చూసిన వారు.. ‘‘మంచి పని చేశావ్.. పెళ్లి చేసుకుని.. ఆపై పీక కోయలేదు. బతికించావ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వధువు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Venu Swamy: నయన తార పెళ్లిపై జ్యోతిష్యుడు వేణు స్వామి ఓపెన్ కామెంట్స్!
ఇది కూడా చదవండి: Young Woman: సిగరేట్ సరదా.. స్నేహితులే ఆ అమ్మాయి పాలిట శత్రువులయ్యారు..