ఈ మద్య అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకోవడంతో దగ్గరలోని వస్తువులు విసురుకునే స్థాయికి వెళ్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్పీకర్ పోడియంలోకి వెళ్లి కాగితాలు విసరడం.. మైకులు విరచడం లాంటి చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇటువంటి ఘటనే ఒడిశా అసెంబ్లీలో చోటు చేసుకోవడంతో పెద్ద రచ్చ జరిగింది. కొంత కాలంగా ఒడిశాలో పలు చోట్ల గనుల అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి వాయిదా తీర్మానం ఇచ్చారు.
జీరో అవర్‌లో దానిపై చర్చించాలని పట్టుబట్టారు. కానీ ఈ అంశం గురించి పట్టించుకోకుండా స్పీకర్ తిరస్కరించారు. కనీసం భోజన విరామం తర్వాత కూడా అదే అంశంపై చర్చకు అనుమతించాలని కోరాడు. కానీ స్పీకర్ మాత్రం ససేమిరా అంటూ తిరస్కరించారు. నేరాలు చేస్తున్న వారి గురించి పట్టించుకోకుండా ఇతర అంశాలపై చర్చలే చేయడం ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ గట్టిగా నిలదీశాడు.
ఈ అంశంపై చర్చించాలని ఎన్ని సార్లు విన్నవించినా స్పీకర్ మాత్రం ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచ్చి హెడ్‌ఫోన్స్ విరగొట్టారు. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి, అక్కడి కుర్చీని పైకెత్తి పడేయడం వల్ల కుర్చీ కూడా విరిగిపోయింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ ప్రవర్తనపై స్పీకర్ మండిపడ్డారు.
ఇది చదవండి: ఇష్టమైన కోడి కూర వండనన్నందుకు భర్త ఆత్మహత్మ!