హోటల్ రూమ్ బుకింగ్స్‌లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. పండుగ సమయాల్లో, హాలీడే సీజన్, వీకెండ్స్‌లో ఓయో రూమ్స్‌కు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఓయో రూమ్స్‌కు ప్రేమికుల రోజున ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే గోవా లాంటి పాపులర్ డెస్టినేషన్‌ను కాదని మరో ప్లేసుకు ప్రేమికులు బాగా వెళ్లారు.
భారత్‌లో హోటల్ రూమ్ బుకింగ్ సేవల్లో ఓయోకు మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో తక్కువ టైమ్‌లో రూమ్ బుకింగ్ సేవల్లో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకున్న సంస్థగా ఓయోకు పేరుంది. అందుబాటు ధరల్లో ఏసీ, వైఫై లాంటి సదుపాయాలను హోటల్ రూమ్స్‌లో అందించడంతో ఓయో బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇండియాతో పాటు విదేశాల్లోనూ ఈ సంస్థ సర్వీసులు అందిస్తోంది. ముఖ్యమైన రోజుల్లో, పండుగ సమయాల్లో, ఇతర సెలవులు, వీకెండ్స్‌లో ఓయో రూమ్స్ ఉండే డిమాండ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.
వెకేషన్స్ కోసం వచ్చే టూరిస్టులు ఓయో హోటల్స్‌ను బాగా వాడుతుంటారు. తక్కువ ధరల్లో మంచి సదుపాయాలు కల్పిస్తుండటంతో సాధారణ ప్రజలకు కూడా అవసరం పడినప్పుడు వీటిని వినియోగిస్తున్నారు. ఇక, లవ్ బర్డ్స్ సంగతి సరేసరి. ఇక, న్యూ ఇయర్ సందర్భంగా ఓయో రికార్డు స్థాయి బుకింగ్స్‌ను నమోదు చేసింది. కొత్త ఏడాది తొలి రోజు ఏకంగా 4.5 లక్షల ఓయో రూమ్ బుకింగ్స్ జరిగాయి. గత ఐదేళ్ల కాలంలో ఇదే అత్యధికం అంటున్నారు. దీంతో ఇది మోస్ట్ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్‌గానూ నిలిచింది.
ప్రేమికుల రోజు లవర్స్‌కు ఎంత స్పెషల్ అనేది తెలిసిందే. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను ప్రేమికులు ఈ రోజు వ్యక్తపరుచుకుంటారు. ప్రేమ జంటలతో పాటు కొత్తగా పెళ్లయిన వారు కూడా ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఏడాదిలో ఒక్కసారే వచ్చి లవర్స్ డే మిస్సయితే.. మళ్లీ సంవత్సరం వరకు ఆగాల్సిందే. అందుకే ముందు నుంచే ఈ డేను ఎలా సెలబ్రేట్ చేసుకుందామని ఆలోచించుకుని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటారు. యాప్ బేస్డ్గా నడిచే హోటల్ బుకింగ్ యాప్ ఓయోకు డిమాండ్ ఏర్పడటానికి కూడా ఇదో కారణమని చెప్పొచ్చు.
ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజు ఓయో రూమ్ రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు చేసింది. ఓయో బుకింగ్స్ గతేడాది ప్రేమికుల దినోత్సవం కంటే ఈసారి దాదాపుగా 35 శాతం పెరిగాయని తెలిసింది. ఈసారి ఫిబ్రవరి 14 వీక్ డే అయినప్పటికీ ఈస్థాయిలో బుకింగ్స్ అనూహ్యమని, తాము ఇది ఊహించలేదంటూ ఓయో యాజమాన్యం ఆశ్చర్యపోతోంది. ఇకపోతే, ఓయో సంస్థ డేటా ప్రకారం.. ప్రేమికుల దినోత్సవం నాడు ఓయో రూమ్ బుకింగ్స్ ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో అత్యధికంగా నమోదయ్యాయట. ఇక్కడ గతేడాదితో పోల్చుకుంటే ఏకంగా 231 శాతం బుకింగ్స్ పెరిగాయి.
ఓయో బుకింగ్స్‌లో బృందావనం తర్వాతి స్థానంలో 51 శాతం పెరుగుదలతో బెంగళూరు, 47 శాతం పెరుగుదలతో హైదరాబాద్, 38 శాతం పెరుగుదలతో కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై, ముంబై నిలిచాయి. పాపులర్ టూరిజం స్పాట్లుగా చెప్పుకునే గోవా, మనాలీ లాంటి ప్రాంతాలను దాటి.. బృందావనం ఫస్ట్ ప్లేసులో నిలవడం అందర్నీ ఒకింత షాక్‌కు గురిచేస్తోంది. గోవాలో లేనిది అక్కడ అంతగా ఏముందని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. గోవా లాంటి పాపులర్ డెస్టినేషన్‌ను కాదని బృందావనానికి లవర్స్ పోటెత్తడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.