SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Noida Woman Drives E Rickshaw With Baby Son Strapped To Her Chest Photo Viral

భర్త వదిలేసి వెళ్లాడు.. చంటిబిడ్డను ఒళ్లో పెట్టకుని ఓ తల్లి సాహసం!

  • Written By: Dharani
  • Published Date - Sun - 25 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్త వదిలేసి వెళ్లాడు.. చంటిబిడ్డను ఒళ్లో పెట్టకుని ఓ తల్లి సాహసం!

మల్టీ టాస్కింగ్‌.. అంటే ఒకే సమయంలో రకరకాల పనులు చక్కబెట్టడం. ఈ విద్యలో ఆరితేరిన వారు మహిళలు.. మరీ ముఖ్యంగా తల్లులు. ఓ వైపు పిల్లలను చూసుకుంటూనే.. ఇంటిని చక్కబెట్టుకుంటూ.. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రాంతం మారినా సరే.. తల్లి పాత్ర మాత్రం మారదు. ఇంట్లో అందరి కంటే ముందుగా లేచి.. చివరగా నిద్ర పోయేది తనే. ఒక్కరోజు అమ్మ తన పనులకు రెస్ట్‌ ఇస్తే.. ఇక ఆ ఇల్లు కిష్కిందలా మారుతుంది. నూటికో కోటికో ఎక్కడో ఓ చోట కొందరు మగాళ్లు మాత్రమే.. భార్యకు బాగాలేకపోతే.. ఇంటి పనులు చూసుకుంటారు. కానీ చాలా ఇళ్లల్లో మాత్రం.. ఆరోగ్యం బాగాలేకున్నా సరే.. ఆడవాళ్లు లేచి ఇంట్లో వాళ్ల బాగోగులు చూసుకోవాల్సిందే. ఇక నేటి కాలం మహిళలయితో ఇంటి పనులతో పాటు ఉద్యోగాలు చేస్తూ.. అన్నింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు చిన్నవాళ్లు అయి.. వారిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోతే.. పిల్లలను కూడా తీసుకుని వెళ్లి పనులు చేసుకునే తల్లులు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మ తన పసిబిడ్డను ఛాతికి కట్టుకుని.. ఆటో నడుపుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు..

నోయిడాకు చెందిన చంచల్ శర్మ (27) అనే మహిళ.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. చంచల్‌కు ఏడాది వయసున్న కొడుకున్నాడు. బాబుని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో.. ఆటోలో తనతో పాటు తన ఏడాది కొడుకుని కూడా తీసుకెళ్తుంది. బాబుని ఛాతికి కట్టుకుని కూర్చొబెట్టుకుని.. ఆటో నడుపుతూ.. జీవిత ప్రయాణం చేస్తుంది. చంచల్‌లకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆమె భర్త. కొన్నాళ్ల క్రితం చంచల్‌ భర్త ఆమెను వదిలేసి వెళ్లాడు. చేతిలో చంటి బిడ్డతో ఒంటరిగా మారింది చంచల్‌. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో తనకు వచ్చిన డ్రైవింగ్‌నే జీవానాధారం చేసుకుంది.

mother

Join Our Whatsapp Channel

డ్రైవింగ​ రావడంతో.. ఆటో నడపాలని నిర్ణయించుకుంది చంచల్‌. చాలా మంది ఆమె ఆటో నడపడాన్ని ఇష్టపడలేదు. అంతేకాక తోటి డ్రైవర్లు ఆమెను అడ్డుకున్నారు. కానీ చంచల్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా లోన్ తీసుకుని.. ఎలక్ట్రిక్‌ ఆటో కొనుక్కుంది. ఎన్నో ఇబ్బందులను దాటుకుని.. ఆటో డ్రైవర్‌గా రాణిస్తోంది చంచల్‌. ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకే ఆమె ఆటోని రోడ్డెక్కిస్తుంది. ప్రస్తుతానికి.. ఆ రూట్‌లో ఉన్న ఏకైక మహిళా ఆటో డ్రైవర్‌ చంచల్‌ మాత్రమే. మహిళా ప్రయాణికులు ఆమె ఆటోను ఎక్కేందుకు ఇష్టపడతారు.

ఈ సందర్భంగా చంచల్‌ మాట్లాడుతూ.. “నా ఆటో ఎక్కే ప్రయాణికులు నన్ను ప్రశంసిస్తార. మహిళా ప్రయాణికులు నా ఆటోలో ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడతారు” అని చెప్పుకొచ్చింది. చంచల్‌కి తల్లి, సోదరుడు ఉన్నారు. అయితే ఏదో ఓ పని చేయకపోతే కుటుంబం గడవదు. అందుకే చంచల్‌ తల్లి కూరగాయలు అమ్ముతుంది. ఆమె సోదరుడు బయట పనికి వెళ్తాడు. దాంతో ఏడాది వయసున్న చంచల్‌ కొడుకును చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ ఉండరు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను తనతో తీసుకెళ్తున్నాని చెప్పింది చంచల్‌. పిల్లాడిని చాతికి కట్టుకుని.. ఆటో నడుపుతుంది.

mother

ఆటో నడపడం ద్వారా.. రోజుకు రూ.600 నుంచి రూ.700 సంపాదిస్తుంది చంచల్‌. అలా సంపాదించిన డబ్బులో రూ.300లు తను ఈ రిక్షా కొనుక్కునేందుకు లోన్‌ ఇచ్చిన ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది. పని పట్ల, తన కొడుకు పట్ల ఆ అమ్మ అంకితభావానికి నోయిడా ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇక చంచల్‌ కథ తెలుసుకున్న నెటిజన్లు కూడా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: కూలీ డబ్బులు చెల్లించనందుకు కోటి రూపాయల కారు తగలబెట్టాడు!
  • ఇది కూడా చదవండి: వీడియో: 90 సెకన్లు.. 17 చెంపదెబ్బలు.. ఈ-రిక్షా డైవర్‌పై రెచ్చిపోయిన మహిళ!

Tags :

  • Auto Driver
  • Noida
  • Photo Viral
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • సరిహద్దు దాటిన మరో ప్రేమ కథ.. ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి..

    సరిహద్దు దాటిన మరో ప్రేమ కథ.. ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

    ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam