Noida Twin Towers: గత కొన్ని నెలలుగా వార్తలో నిలిచిన ట్విన్ టవర్స్ నేలకూలాయి. ఆదివారం 2.30 గంటల సమయంలో అధికారులు ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. దాదాపు 9 సెకన్లలోనే 40 అంతస్తుల భవనం కుప్పకూలింది. ట్విన్ టవర్స్ కూల్చివేత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు దేశంలోని అన్ని మీడియా ఛానళ్లు ట్విన్ టవర్స్ కూల్చివేతను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కాగా, ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని సెక్టార్-93లో 2009లో ఓ సంస్థ 40 అంతస్తుల రెండు భవన సమూదాయాల్ని నిర్మించింది.
కుతుబ్ మినార్ కంటే 100 మీటర్లు ఎత్తైన ఈ భవనాలు ట్విన్ టవర్స్‌గా పేరుగాంచాయి. వీటిలో ఒకదాని పేరు సియాన్ కాగా, మరో దాని పేరు అపెక్స్. అయితే, ఈ భవనాలు రెండూ నిబంధనలకు విరుద్ధంగా కట్టించారని తేలింది. దీంతో కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితమే అధికారులు ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. మరి, నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | Once taller than Qutub Minar, Noida Supertech twin towers, reduced to rubble pic.twitter.com/vlTgt4D4a3
— ANI (@ANI) August 28, 2022