దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్ధాలు గుడుస్తున్నా ఇంకా సరైన రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయి. మారుమూల గ్రామాలు, తండాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ దుస్థితి నెలకొని ఉంది. సరైన రోడ్డు సదుపాయం లేక.. వరద నీటిలోనే వృద్ధుడి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని ప్రజాప్రతినిధులు ఎన్నో హామీలు ఇస్తుంటారు. శివమొగ్గ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడింది. ఇక్కడ రోడ్డు సదుపాయం లేకపోవడంతో.. మృతదేహాలను దహనం చేసేందుకు సగం వరకు నీటిలో మునిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇటీవల కొడ్లు గ్రామానికి చెందిన 80 ఏళ్ల తమ్మయ్య గౌడ మృతి చెందాడు. మృతదేహాన్ని దహనం చేయడానికి . గ్రామస్తులు, కుటుంబసభ్యులు మృతదేహాన్ని భుజాలపై మోస్తూ సగం వరకు నీటిలో తడుచుకుంటూ నడిచారు. ఎత్తయిన ప్రదేశానికి తీసుకెళ్లి వర్షంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక్కడ గ్రామంలో స్మశానానికి వెళ్లడానికి సరైన రోడ్డు వసతి లేదని ఎప్పటి నుంచో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తమ గోడు విన్నవించుకుంటూనే ఉన్నామని.. ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మృతదేహాన్ని దహనం చేసేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.