గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మద్య కాలంలో బ్యాటరీతో నడిచే వాహనాలు కాస్త ఊరట ఇస్తున్నాయి. ఇక వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్, కరెంటు అవసరం లేకుండా వాహనాలు రోడ్ల మీదకు రానున్నాయి. అదేంటీ ఏ వాహనం నడవాలన్నా ఇంధనం, కరెంట్ చాలా ముఖ్యం కదా? మరి అవి లేకుండా వాహనాలు రోడ్లపై నడవడం ఏంటా అనుకుంటున్నారా? త్వరలోనే హైడ్రోజన్ కార్లు తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేటు లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ కారును పరీక్షించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం చేయనున్నారు. సాధారణంగా ఇంధనం ఎలా నింపుతారో.. హైడ్రోజన్ ను కారులో నింపవచ్చు. వాతావరణంలో లభించే హైడ్రోజన్ గ్యాస్ వాడకం అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని బాగా తగ్గించవచ్చు.
ఇది చదవండి : అల్లు అర్జున్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ..!
వాస్తవానికి ఈ పైలట్ ప్రాజెక్టు దేశ రాజధాని ఢిల్లీలో గతంలోనే ప్రారంభించారు. అంతేకాదు ఇటీవల టయోటా కంపెనీకి చెందిన మిరాయ్ కారులో హైడ్రోజన్ ఫ్యూయల్ ని ఫుల్ ట్యాంక్ చేసి 1,359 కిలో మీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ మొత్తం ప్రయాణించడానికి 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్ ను వినియోగించింది. ఈ పైలట్ ప్రాజెక్టు దేశ రాజధాని ఢిల్లీలో గతంలోనే ప్రారంభించారు. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులపై ఈ పైలట్ ప్రాజెక్టు అధ్యయనం నిర్వహిస్తుంది.