బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపేస్తామంటూ ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా ఆయన కార్యాలయానికే ఫోన్ చేసిన దుండగుడు, రూ. 10 కోట్లు ఇవ్వకపోతే గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాను అడిగినట్లు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేనియెడల గడ్కరీకి హాని తప్పదని కాల్స్ ద్వారా ఒక వ్యక్తి హెచ్చరించాడు. ఈ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. నాగ్‌పుర్‌లోని గడ్కరీ ఇల్లు, ఆయన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న నితిన్ గడ్కరీ కార్యాలయానికి జయేశ్ పూజారి అనే వ్యక్తి సోమవారం ఉదయం ఫోన్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేనియెడల గడ్కరీని హత్య చేస్తామని హెచ్చరించాడు. ఈ క్రమంలో అతడు తనను తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్నాడు. తన పేరు జయేశ్ పూజారీ అలియాస్ జయేశ్ కాంతి అని గడ్కరీ కార్యాలయ సిబ్బందికి వివరించాడు. ఉదయం రెండు సార్లు, మధ్యాహ్నం ఒకసారి.. మొత్తం మూడు సార్లు కాల్స్ చేశాడు. ఈ బెదిరింపు కాల్స్ పై గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు నాగపూర్ లోని గడ్కరీ ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో ఇదే వ్యక్తి గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేసి, రూ. 100 కోట్లు ఇవ్వకపోతే, గడ్కరీని హత్య చేస్తానని బెదిరించాడు. అప్పుడు కూడా ఒక రోజంతా వరుసగా కాల్స్ చేయడంతో.. ఆయన వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడైన పూజారీకి ఒక హత్య కేసులో మరణ శిక్ష విధించారు. ప్రస్తుతం అతడు కర్నాటకలోని బెలగావిలో జైళ్లో శిక్షను అనుభవిస్తున్నాడు. కేంద్ర మంత్రికే బెదిరింపు కాల్స్ రావడం పట్ల.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nitin Gadkari gets 2 threat calls at his Nagpur office; Maharashtra police beefs up security
🛰️ Catch the day’s latest news ➠ https://t.co/f8CctkaT2o pic.twitter.com/QYTzKwsJNQ
— Economic Times (@EconomicTimes) March 21, 2023