కరోనా సమయంలో తాను ఇంట్లో వంట చేయడం, ఆన్‌లైన్లో లెక్చర్స్ ఇవ్వడం ఈ రెండు పనులు మాత్రమే చేశానని కేంద్ర రోడ్డు రవాణా, రహదారి శాఖా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఆన్‌లైన్లో ఇచ్చిన లెక్చర్ వీడియోలు య్యూటూబ్‌లో పెడితే మంచి ఆదరణ పొందాయని ఆయన చెప్పారని ఏఎన్‌ఐ తెలిపింది. నెలకు నాలుగు లక్షలు య్యూటూబ్ ద్వారా సంపాదిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో మన కేంద్ర మంత్రి చేసిన మహా గొప్ప కార్యాక్రమాలు ఇవి అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.