ప్రపంచ కుబేరుల్లో ఒకరైన నీతా అంబానీ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి రోజు ఆమె వాడే వస్తువుల ఖరీదు లక్షల నుంచి కోట్ల రూపాయలు ఉంటుంది. ఆఖరికి టీ కప్పు ఖరీదు కూడా లక్షల్లో ఉంటుంది.
సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే అలవాటు ప్రకారం ముందుగా టీ తాగుతూ ఉంటారు. ఆ తర్వాతే రోజూ వారి పనులలో నిమగ్నమవుతూ ఉంటారు. సామాన్య ప్రజలు తమ స్టేటస్‌ను బట్టి టీని కప్పుల్లో, గ్లాసుల్లో తాగుతారు. కానీ, భారత దేశ అపర కుబేరుడు బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మాత్రం మన మతి పోగొట్టే విధంగా టీ తాగుతారు. విలాసవంతమైన వస్తువుల వాడకం ద్వారా తరచుగా సోషల్ మీడియాలో నిలిచే ఆమె.. టీ తాగే విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సాధారణ వ్యక్తి లాగే నీతా అంబానీ కూడా ప్రతి రోజును టీతో తన రోజును ప్రారంభిస్తారు.
సామాన్యులు రూ.10 టీ, మామూలు కప్‌లో టీ తాగితే.. నీతా అంబానీ మాత్రం తన స్టేటస్‌కు తగ్గట్లుగా అత్యంత ఖరీదైన టీ కప్‌లో టీ తాగుతుంది. ఆమె రోజువారీగా తాగే టీ కప్ ఖరీదు రూ. 3 లక్షల రూపాయలు. ఈ కప్పును జపాన్‌కు చెందిన క్రోకరీ కంపెనీ నోరిటెక్ తయారు చేసింది. మొత్తం టీ సెట్ ధర రూ.1.5 కోట్లకు పైగా ఉంటుంది. కాగా, నీతా అంబానీ తను ధరించే దుస్తులు, డిజైనర్ ఐటమ్స్ ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె ధరించే అత్యంత ఖరీదైన చీరలు రూ. లక్షల్లో ఉంటాయి. నీతా కుమార్తె ఇషా అంబానీ పెళ్లిలో లెహంగా ధరించారు.
అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!.. అది ఎంతంటే.. రూ. 90 కోట్ల రూపాయలు. 60 ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ చాలా అందంగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి వేడుకలు, పార్టీలలో ఎంతో అందంగా తయారు అవుతారు. అందుకు గాను పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ నైపుణ్యం ఎంతో ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. మరి, ఖరీదైన కప్పులో టీ తాగుతున్న నీతా అంబానీ లగ్జరీ లైఫ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.