చాలా మంది యువతీ, యువకులు ప్రేమ పేరుతో పార్కుల్లో వెధవ వేషాలు వేస్తూ ఉంటారు. చెట్లల్లో, పొదల్లో పాడు పనులకు పాల్పడుతూ ఉంటారు. అలాంటి వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు నిర్వాహకులు..
సాధారణంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడపటానికి, మనసు బాగోలేనపుడు రీఫ్రెస్ అవటానికి పార్కులకు వెళుతూ ఉంటాము. కానీ, కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో పార్కుల్లో వెధవ వేషాలు వేస్తూ ఉంటారు. బెంచీల మీదో.. తుప్పల్లోనో విచ్చల విడితనంగా వ్యవహరిస్తూ ఉంటారు. పక్కన ఎవరు ఉన్నారో పట్టించుకోకుండా పాడు పనులకు పాల్పడుతుంటారు. చాలా వరకు పార్కుల్లో జరిగేది ఇదే. ఇలాంటి పనుల కారణంగా ఇబ్బందికి గురైన.. బెంగళూరులోని ఓ పార్కుకు వెళ్లే సందర్శకులు.. పార్కు నిర్వహకులకు వరుస ఫిర్యాదులు చేశారు. దీంతో పార్కు నిర్వహకులు ప్రేమ పేరుతో వెకిలి చేష్టలకు పాల్పడే వారికి, పార్కును అపరిశుభ్రం చేసేవారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలో కబ్బాన్ అనే ప్రముఖ పార్కు ఉంది. దాదాపు 300 ఏకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. కుటుంబాలు, వృద్దులు, ప్రేమికులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే, ఈ పార్కుకు వచ్చే ఎక్కువ శాతం ప్రేమికులు వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. చిన్న పిల్లలు, కుటుంబాల ముందే పాడు పనులు చేస్తున్నారు. దీనిపై పెద్ద సంఖ్యలో పార్కు నిర్వాహకులకు ఫిర్యాదులు వెళ్లాయి. సందర్శకుల ఫిర్యాదుతో నిర్వాహకులు చర్యలకు సిద్ధమయ్యారు.
కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకు వచ్చారు. ఆ రూల్స్ ప్రకారం.. యువతీ, యువకులు ఒకరికి ఒకరు దగ్గరగా వెళ్లకూడదు. బయటినుంచి లోపలికి ఆహారాన్ని తీసుకెళ్లకూడదు. లోపల ఫొటోలు, వీడియోలు తీసుకోకూడదు. అంతేకాదు! లోపల ఆటలు ఆడరాదు. చెట్లను ఎక్కరాదు. ఇక, ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. సందర్శకులు ఈ రూల్స్ ఫాలో అయ్యేలా ఇప్పటినుంచి ఓ నెల పాటు సెక్యూరిటీ గార్డులు పెట్రోలింగ్ చేస్తారు. రూల్స్ అతిక్రమిస్తుంటే విజిల్ ద్వారా లేదా లౌడ్ స్పీకర్ ద్వారా వారిని హెచ్చరిస్తారు. మరి, బెంగళూరు కబ్బన్ పార్కు తీసుకువచ్చిన కొత్త రూల్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.