కరోనా సెకండ్ వేవ్ సమయంలో టాటా స్టీల్ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడుతూ ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. ప్రచారం కాదు కావాల్సింది. ఎంత మందికి సహయ పడ్డాం అన్నది ముఖ్యమన్న లైన్ లో టాటా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ప్రచారం కోసం పని చేస్తూ, సొంత ఉద్యోగులను పట్టించుకోని కంపెనీలు అనేకం ఉన్నాయి. కరోనా కష్టకాలంలో జీతాలు కోసేసి, ఉద్యోగాలు పీకేసి నడి రోడ్డు మీద నిలబెడుతున్న సంస్థలు కోకొల్లలు. టాటా స్టీల్ కంపెనీ గొప్ప నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 నుండి మరణించిన తన ఉద్యోగుల కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుంది. వారికి పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం టాటా స్టీల్ లో కరోనాతో మరణించిన ఉద్యోగి పూర్తి జీతం వారి కుటుంబ సభ్యులకు వారి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల వరకు చెల్లించడం కొనసాగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
టాటా స్టీల్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది టాటా స్టీల్ అత్యుత్తమ సామాజిక భద్రత పథకాలు వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయి తద్వారా మరణించిన ఉద్యోగి 60 సంవత్సరాల వయస్సు వరకు డ్రా అయిన జీతం కుటుంబానికి చివరి వరకు లభిస్తుంది. వైద్య ప్రయోజనాలు మరియు గృహ సౌకర్యాలతో పాటు నామినీకి ఇవన్నీ దక్కుతాయని సంచలన ప్రకటన చేసింది. జీతంతో పాటు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు వైద్య ప్రయోజనాలు మరియు నివాస సౌకర్యాలను కూడా సంస్థ అందిస్తుంది. కంపెనీ ఉద్యోగి కోవిడ్ -19 కారణంగా మరణాన్ని ఎదుర్కొంటే గ్రాడ్యుయేషన్ వరకు వారి పిల్లల విద్య అన్ని ఖర్చులను టాటా స్టీల్ భరిస్తుందని తెలిపింది. కరోనా కష్టకాలంలో శవాలపై పేలాలు ఏరుకుంటున్న కార్పోరేట్లు ఉన్న ఈ సమాజంలో టాటా స్టీల్ నిర్ణయం గొప్ప ప్రేరణ అంటూ సోషల్ మీడియా పొగడ్తలతో ముంచెత్తుతుంది.