కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలం థియేటర్లు మూతపడి ఓటిటి వేదికలకు విశేష ఆదరణ పెరిగింది. పెద్ద నుండి చిన్న సినిమాల వరకు ఎక్కువగా ఓటిటిలలో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు కూడా ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక సినిమాలే కాకుండా టీవీ ప్రోగ్రాంలు, ఎంటర్టైన్ మెంట్ రియాలిటీ షోలు, వెబ్ సిరీస్ లకు అలవాటుపడిన జనాలు అన్ని ఓటిటిలను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.
తాజాగా ఓ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎంటర్టైన్ మెంట్ కోసం యూజర్లు సాధారణంగా తాము సబ్ స్క్రైబ్ చేసుకున్న ఖాతాలను.. వేర్వేరు డివైస్ లలో లాగిన్ అయ్యి వాడుకుంటున్నారు. ఎలాగో పాస్ వర్డ్ షేరింగ్ ఆప్షన్ ఉందికదా అని.. ఒకే ఖాతాను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ లకు షేర్ చేస్తుంటారు.ఈ విధంగా ఒకే ఖాతా పై చాలా మంది వినోదం పొందుతున్నారు.ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఒకే సబ్ స్క్రిప్షన్ పై ఎక్కువమంది వాడకానికి చెక్ పెట్టే దిశగా ఆలోచిస్తుంది. ఖాతాలు షేర్ చేసుకోవడం వలన కొత్త సబ్ స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోవడంతో పాటు కొత్త కంటెంట్ క్రియేట్ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ తాజా ప్రకటనలో పేర్కొంది. అందువలన మొదటగా చిలీ, కోస్టారికా, పెరూ దేశాలలో.. ఒకే ఖాతాను ఎక్సట్రా ఇద్దరు ఉపయోగిస్తే.. అదనంగా నెలకు 2 – 3 డాలర్స్ ఛార్జి చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఇక మొదటిగా ఈ పద్ధతి పెరూ, కోస్టారికా, చిలీ దేశాలలో టెస్ట్ చేసిన తర్వాత మిగతా దేశాలలో కూడా అమలు చేయనున్నట్లు సమాచారం. మరి అదేగనుక ఇండియాలో అమలైతే.. నెట్‌ఫ్లిక్స్ ఖాతా షేరింగ్ అనేది భారీ మూల్యంతో కూడుకునే అవకాశం ఉందని యూజర్లు ఆలోచిస్తున్నారు. అదీగాక మిగతా ఓటిటిలు కూడా ఇదే పద్ధతి అమలు చేస్తే అకౌంట్ షేరింగ్ కష్టమే. ఈ విధంగా ఓ కొత్త పద్దతికి నాంది పలకనుంది నెట్‌ఫ్లిక్స్. మరి మీరు కూడా నెట్‌ఫ్లిక్స్ యూజర్ అయితే ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.