దేశంలో ఎప్పుడు ఉగ్రవాదుల కాల్పులు, తుపాకుల మోతతో నిత్యం టెన్షన్ వాతావరణం కలిగి ఉండే ప్రదేశం కాశ్మీర్ లోయ ప్రాంతం. ఇక్కడ ప్రశాంత వాతావరణ తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎప్పుడూ ఎదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంటారు. అలాంటి వాతావరణంలో హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక కశ్మీరీ లోయలో పండిట్లు, ముస్లింల మద్య స్నేహసంబంధాలు, సోదరభావం ఎంతో గొప్పగా ఉందని చాటి చెప్పే విధంగా ఓ వివాహ వేడుక జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ముప్పై సంవత్సరాల క్రితం కశ్మీర్ లోయలో భీకరమైన అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో కశ్మీరీ పండిట్లు ఊచకోతకు గురయ్యారు. దీంతో చాలా మంది భయంతో అక్కడి ప్రదేశాన్ని విడిచి రాత్రికి రాత్రే వెళ్లిపోయారు. అందులో చాలా మంది జమ్మూతో సహా దేశంలోని ఇతర నగరాలకు వలస వచ్చి స్థిరపడ్డారు. కానీ కొంత మంది కశ్మిరీ పండిట్లు మాత్రం తాము పుట్టిన గడ్డను మాత్రం విడిచి ఉండలేక అక్కడే ఉన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని ఉగ్రవాద సంస్థలు వ్యాలీని వదిలి వెళ్లిపోవాలని దాడులు జరుపుతూనే ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పండిట్ కుటుంబాలు ఇప్పటికీ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. పండిట్లు, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.
ఎప్పుడూ తుపాకుల మోతతో దద్దరిల్లే ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లువిరిసింది. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన మోహన్ లాల్ పండిట్ కొన్ని సంవత్సరాల క్రితం కన్నుమూశాడు. ఆయన కూతురు వివాహం ఎంతో వైభవంగా సాంప్రదాయబద్దంగా జరిగింది. మీనా కుమారి పెళ్లికి స్థానిక ముస్లిం పెద్దలు, మహిళలు అందరూ పాల్గొన్నారు. పెళ్లి తంతు ని పూర్తిగా తమ బాధ్యతగా తీసుకొని సాంప్రదాయబద్దంగా జరిపించారు ముస్లింలు. తండ్రి లేని మీనా కుమారి ఎప్పుడూ అనాథ కాదని,ఆమెకు తామంతా ఉన్నామని స్థానిక ముస్లిం ఒకరు తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.