సాధారణంగా ప్రజలు ఇద్దరి వద్ద చేతులు జోడిండి కాపాడమని వేడుకుంటారు. వారిలో ఒకరు దేవుడు అయితే మరొకరు వైద్యుడు. అంతలా సమాజంలో వైద్యుడికి ప్రత్యేక గౌరవం ఉంది. అయితే చాలా మంది వైద్యులు సైతం తమ వద్దకు వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడి సంతోషంగా ఇంటికి పంపిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ నిర్లక్ష్యంతో పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య వృతికే అపకీర్తి తెస్తున్నారు.
సాధారణంగా ప్రజలు ఇద్దరి వద్ద చేతులు జోడిండి కాపాడమని వేడుకుంటారు. వారిలో ఒకరు దేవుడు అయితే మరొకరు వైద్యుడు. అంతలా సమాజంలో వైద్యుడికి ప్రత్యేక గౌరవం ఉంది. అయితే చాలా మంది వైద్యులు సైతం తమ వద్దకు వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడి సంతోషంగా ఇంటికి పంపిస్తుంటారు. అలా ఎందరివో ప్రాణాలు కాపాడుతూ చాలా మంది వైద్యులు ప్రజల గుండెల్లో దేవుళ్ల నిలిపోతున్నారు. కానీ కొందరు మాత్రం తమ నిర్లక్ష్యంతో పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య వృతికే అపకీర్తి తెస్తున్నారు. తాజాగా తుంటి ఎముక విరిగిందని ఆసుపత్రికి వెళితే వైద్యులు గుండెకు ఆపరేషన్ చేయడంతో పేషంట్ మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దినేశ్ కుమార్ సక్సేనా అనే 66 ఏళ్ల వ్యక్తి కింద పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. రాజస్థాన్ లో డాక్టర్ సమ్మె చేస్తుండడంతో నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం వైద్యులు రోగికి యాంజియోగ్రఫీ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం సమయంలో పేషంట్ మృతిచెందాడు. ఆయన బంధువులు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తమ తండ్రి చనిపోయాడని ఆరోపిస్తున్నారు. గతంలో తన తండ్రి రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడని మృతుడి కుమారుడు శుభమ్ సక్సేనా తెలిపారు.
బుధవారం ఉదయం వరకు ఆయన పరిస్థితి బాగానే ఉందని, యాంజియోగ్రఫీ చేసే ముందు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మృతుడి కుమారుడు ఆరోపించారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో తన తండ్రి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, అనుమానం వచ్చి వైద్యులను ప్రశ్నిస్తే 5 గంటల సమయంలో మృతి చెందినట్లు సమాచారం ఇచ్చాడని తెలిపాడు. ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మృతుడి బంధువుల ఆరోపణలపై ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఆస్పత్రిలో చేరే సమయానికే రోగి గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.
మృతుడికి షుగర్ ఎక్కువగా ఉందని, రోగికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను బంధువులకు అందించామని వైద్యులు తెలిపారు. అలానే రోగికి చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని, మృతుడి కుటుంబీకుల ఆరోపణలు నిరాధారమని ఆస్పత్రి వైద్యులు ఖండించారు. అయితే ఇలా నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కొందరి వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు చూడగా తాజాగా ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.