రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక.. నవీన్ మరణంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రవేదనకు లోనయ్యారు. కుమారుడు మరణంతో తీవ్ర కలత చెందిన నవీన్ తండ్రి శేఖరప్ప భారతీయ వైద్య విద్యా వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని హవేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన నవీన్.. ఖార్గీవ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ కి వెళ్లాడు. ఇప్పుడు మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నా నవీన్.. మరి కొద్ది రోజుల్లో చదువు పూర్తి చేసుకుని.. ఇండియా తిరిగి రావాల్సి ఉండగా బాంబుల దాడుల్లో తిరిగిరాని లోకానికి వెళ్లాడు.
భారతీయ వైద్య విద్యావస్థపై శేఖరప్ప మాట్లాడుతూ..”PUC లో నా కొడుకు 97 శాతం మార్కులు వచ్చాయి. అయినప్పటికి రాష్ట్రంలో మెడికల్ సీటు సాధించలేకపోయాడు. మెడికల్ సీటు సంపాదించాలంటే కోట్లాది రూపాయిలు ఇవ్వాలి. అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి అయినప్పటికీ.. ఇక్కడ సీటు రాక..సీటు లేక.. దూరతీరాలకు వెళ్లి.. వాళ్ల యుద్ధంలో బలి కావాల్సి వచ్చింది. ఇది ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక్కడ కొన్ని విషయాలు కచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నవీన్ సమస్య.. అతడి తల్లి గుండెకోతకు సంబంధించిన సమస్యో కాదు.. దేశంలో ఇంకా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులకు సంబంధించిన సమస్య” అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
MBBS నాలుగో సంవత్సరం..అంటే మరో రెండేళ్లయితే పీజీ కూడా చేసి డాక్టర్ అవుతాడు. కుటుంబానికి అండగా నిలబడతాడు. అలాంటి చురుకైన విద్యార్థి హఠాత్తుగా చనిపోతే. అది కూడా దేశం కాని దేశంలో.. ఎవరెవరికో మధ్య జరిగిన యుద్ధంలో అకారణంగా బలైపోతే. ఆ కుటుంబం గుండెకోత ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం నవీన్ తల్లిదండ్రుల పరిస్థితి ఇది. మరి.. నవీన్ తండ్రి శేఖరప్ప చెప్పిన విషయాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
"For MBBS In India, Donations are very bad and intelligent students are going abroad as they have to spend Crores and Crores here – also seats here are allotted only based on Caste-Based Reservations and not on Merit" – Naveen's Father.
Om Shanthi Naveen!! pic.twitter.com/bNxOcu3Zkv
— இந்தா வாயின்கோ – Take That (@indhavaainko) March 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.