ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. అలానే దాని వినియోగంలో సెలబ్రిటీలతో పోటీ పడుతుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు. తాజాగా మోదీ యూట్యూబ్ ఛానెల్ మరో రికార్డు సృష్టించింది. ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. ప్రపంచంలో ఇతర ఏ దేశాధినేతలకు ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో మోదీ వారందరిని వెనక్కి నెట్టి.. కోటి మంది సబ్ స్క్రైబర్లతో రికార్డు సృష్టించాడు.
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బల్సోనరో యూట్యూబ్ చానెల్ కి 36 లక్షల సబ్‌స్క్రైబర్లు, మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 30.7 లక్షలు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 28 లక్షలు, జో బైడెన్ 19 లక్షలు, వైట్ హౌస్ 19 లక్షల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి : ఆలయ సిబ్బందికి ప్రధాని మోదీ జూట్ పాదరక్షలు కానుక..!
ఇక దేశంలో చూసుకుంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానెల్ కి 5.25 లక్షలు, శశిధరూర్ ఛానెల్ కి 4.39 లక్షల మంది, అసదుద్దీన్ ఓవైసీ 3.73 లక్షల మంది, స్టాలిన్ 2.12 లక్షల సబ్‌స్క్రైబర్లు, మనీశ్ సిసోడియా 1.3 లక్షల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నరేంద్ర మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్‌లో కూడా ముందు ఉన్నాడు. ప్రస్తుతం మోదీకి ట్విట్టర్‌లో 75. 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.