ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ దివ్యాంగుడితో సెల్ఫీ దిగారు. ఆ ఫొటోలు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అప్పటినుంచి ఆ వ్యక్తి గురించి చర్చ జరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సౌత్ ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. నిన్న తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు తమిళనాడులోని చెన్నైలో కూడా ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక, చెన్నై పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ ఓ దివ్యాంగుడితో స్పెషల్ సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
దీంతో ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూస్తున్న వారు ఎవరా వ్యక్తి? ప్రధానే నేరుగా సెల్ఫీ తీసుకునేంత ప్రత్యేకత ఏంటి? అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ వ్యక్తి గురించి స్వయంగా మోదీనే తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘‘ నేను చెన్నైలో ఎస్ మణికందన్‌ను కలిశాను. ఇతడు ఈరోడ్‌కు చెందిన ఓ గర్వించదగ్గ బీజేపీ కార్యకర్త. అతడు దివ్యాంగుడు. ఓ షాపును నిర్వహిస్తున్నాడు. అది కూడా ఓ గొప్ప పని కోసం.
అతడు తనకు వచ్చే రోజూ వారి ఆదాయంలో కొంత భాగాన్ని బీజేపీ కోసం ఇచ్చేస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. కాగా, మోదీ తెలంగాణలో తన పర్యటనలో భాగంగా మొత్తం 11,355 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనుల ప్రారంభించారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించారు. రిమోట్ ద్వారా శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ది మరింత వేగవంతం చేసే అదృష్టం తనకు కలిగిందని అన్నారు.
7,865 కోట్ల రూపాయల విలువైన హైవే పనులకు శంకుస్థాన చేశామన్నారు. తెలంగాణ , ఏపీని కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించామని చెప్పారు. మహబూబ్ నగర్ – చించోలి రహదారి, కల్వకుర్తి-కొల్లాపూర్ రహదారి పనులు చేపట్టామన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్ వేశామని తెలిపారు. మరి, ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చిన మణికందన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A special selfie…
In Chennai I met Thiru S. Manikandan. He is a proud @BJP4TamilNadu Karyakarta from Erode, serving as a booth president. A person with disability, he runs his own shop and the most motivating aspect is – he gives a substantial part of his daily profits to BJP! pic.twitter.com/rBinyDVHYA
— Narendra Modi (@narendramodi) April 8, 2023