విద్యా వ్యవస్థలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. తమను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యపు ధోరణితో ఉంటారు. కొన్ని సార్లు ప్రభుత్వ నియమ, నిబంధనలను కూడా ఖేతారు చేస్తారు. ఇలా చేసే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి.
విద్యా వ్యవస్థలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. తమను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యపు ధోరణితో ఉంటారు. కొన్ని సార్లు ప్రభుత్వ నియమ, నిబంధనలను కూడా ఖేతారు చేస్తారు. ఇలా చేసే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోధ్యాయుల తీరు వార్తల్లో నిలిచింది. వారి విషయంలో బీహార్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రంలోని నలందా ప్రభుత్వ పాఠశాలలను సొంతంగా నిర్వహిస్తున్న ఆ జిల్లాలోని 248 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు 48 గంటల అల్టిమేటం కూడా సదరు ఉపాధ్యాయులకు జారీ చేశారు. ఆ నిర్ణీత సమయంలో ఉత్తర్వులను పాటించకపోతే, వారందరికీ వ్యతిరేకంగా ఫారం-ఏ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. డీఈవో జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అన్ని రకాల పాఠశాలల్లో 2022-23 అకాడమిక్ ఇయర్ లో చేరిన విద్యార్థులందరి డేటాలను నమోదు చేయాలి.
అలా నమోదు చేసిన విద్యార్థుల డేటాను భారత ప్రభుత్వ వెబ్ పోర్టల్ లో నమోదు చేయబడుతోంది. అందులో భాగంగా.. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులందరి వివరాలను భారత ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. అయితే నలందా జిల్లాలోని 248 పాఠశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కాలేదు. ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం, ఏకపక్షం, ఉదాసీనత ఆదేశాలను ఉల్లంఘించడం స్పష్టంగా కన్పిపించాయి. డేటాను నిర్వహించడానికి మే 15 చివరి తేదీగా భారత ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా విద్యా అధికారి తెలిపారు.
దీంతో పాఠశాలల హెచ్‌ఎంలను లేఖలు, ఫోన్ కాల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పలుమార్లు ఆదేశించారు. అయితే ఈ ప్రధానోపాధ్యాయులంతా నిర్లక్ష్యంగా ఉండి..ఉద్దేశపూర్వకంగానే ఈ పనిలో అలసత్వం వహించారని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం వీరిపై చర్యలకు ఉపక్రమించింది. వెంటనే 48 గంటలలోపు తగినవిధంగా స్పందించకుంటే, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.