కొన్నేళ్ల క్రితం అంగరంగవైభవంగా వారిద్దరి పెళ్లి జరిగింది. సాంప్రదాయ బద్ధంగా అన్ని తంతులు పూర్తి చేశారు. కానీ పెళ్లి చేసుకున్న భర్తను మాత్రం ఆభార్య దగ్గరకు రానివ్వలేదు. కూర్చుని మాట్లాడినా సమాధానం ఇవ్వలేదు. సరే పెళ్లి ఇష్టం లేదా అంటే ఆ విషయం కూడా కాదు. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంది. అయితే.. ఓ రోజు వారిద్దరు కలయిక కోసం ప్రయత్నించగా భర్తకు ఊహించని షాక్ ఎదురైంది. తన భార్యకు పురుషుల మాదిరి జననేంద్రియాలు ఉన్నట్లు అతను గమనించాడు. అంతే.. బుర్ర గిర్రున తిరిగింది. తాను పెళ్లి చేసుకున్నది పురుషుడినా అని ప్రశ్నించుకున్నాడు. దీంతో స్త్రీ అని చెప్పి తనకు పురుషుడితో పెళ్లి చేశారంటూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
2016లో గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తికి అదేప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమయ్యింది. అయితే.. పెళ్లి నాటి నుంచి భార్య అతన్ని దూరం పెడుతూ వచ్చింది. పెళ్లయిన వెంటనే తనకు రుతక్రమం అని చెప్పి శోభనం తప్పించుకుంది. పుట్టింటికి వెళ్లి మళ్లీ ఆరు రోజుల తర్వాత తిరిగొచ్చింది. అప్పడు కూడా భర్తను దగ్గరకు రానివ్వలేదు. భయంతో అలా చేస్తుంది అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు శారీరకంగా కలిసేందుకు ప్రయత్నించగా ఆమెకు పురుషుల లాగే జననేంద్రియాలు ఉన్నట్లు గమనించాడు. దీంతో ఆసుపత్రిలో టెస్టులు చేయించగా.. ఆమెకు ‘ఇంపర్‌ఫోరేట్ హైమెన్’ అనే సమస్య ఉందని నిర్ధారణ అయింది. ( బిగ్ బ్రేకింగ్.. స్టార్ హీరోయిన్ అరెస్ట్! )
అందుకే.. ఆమె అవయవం కొంత పురుషుల మాదిరిగా ఉందని డాక్టర్లు చెప్పుకొచ్చారు.. పెళ్లి అయ్యాక ఓ రేంజ్‌లో జీవితాన్ని ఊహించుకున్న ఆ వ్యక్తికి తేరుకోలేని షాక్ కొట్టింది. దీంతో ఆమెతో కాపురం చేయలేనని తెగేసి చెప్పి పుట్టింటికి పంపేశాడు. అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనపై కేసు పెట్టడంతో భర్త కూడా వారిపై చీటింగ్ కేసు పెట్టాడు. తనకు స్త్రీ అని చెప్పి పురుషుడితో పెళ్లి చేశారని.. ఇది చీటింగ్ అని చెప్పాడు. దీంతో మరోసారి వైద్య పరీక్షలు జరపగా అవే రిజల్ట్స్ వచ్చాయి. దీంతో ట్రయల్ కోర్టు ఆదేశాలతో ఆమె హైకోర్టులో సవాల్ చేసింది.
అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ వ్యక్తి తరఫు న్యాయవాది.. ఈ చీటింగ్ పెళ్లిపై వాదనలు వినిపించాడు. వాదనలు విన్న కోర్టు అతని భార్యతో పాటు కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఇతనికి మాత్రం నూరేళ్ల మంటగా మారింది. నిజం తెలిశాక అయోమయంలో పడ్డాడు. తేలుకోడానికి టైమ్ పట్టినప్పటికి.. ఆ బంధం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాడు. మరీ ఈ కథ క్లైమాక్స్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రైలు దిగుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.