భారతదేశం అనేక కులమతాల నిలయం. భిన్నత్వంలో ఏకత్వం మనదేశంలో తప్ప ప్రపంచంలో మరేక్కడా కనిపించదు. ఒకే మతం ఉండే కొన్ని దేశాల్లో వారిపై వారే దాడులు చేసుకుంటున్న ఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం. అనేక రకాల కుల, మత, తెగలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజలు చిన్న చిన్న సమస్యలు మినహా అందరూ కలిసిమెలసి ఉంటారు. ఒకరి దేవుళ్లును మరొకరు గౌరవించుకోవడం, అక్కడక్కడ పూజించటం జరుగుతుంటాయి. మత విద్వేషాలు పెంచే వారికి చెంపపెట్టులా, దీపావళి సందర్భంగా ముస్లిం మహిళలు రాముడికి హారతులు ఇచ్చారు.
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో ఓ ముస్లిం కుటుంబలోని జీన్ అన్సారీ అనే మహిళ దాదాపు 15 ఏళ్ల నుంచి రాముడికి హారతులు ఇస్తున్నారు. నిన్న దీపావళికి కూడా మరికొందరు మహిళలతో కలిసి రాముడుకి హారతులు ఇస్తూ పూజలు చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఉన్నాయని సోషల్ మీడియాల్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇలా మత సామరస్యానికి తోడ్పడుతున్న ఈ మహిళలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.