ఎమ్మెల్యే రాజా సింగ్ అనగానే చాలా మందికి వివాదాస్పదమైన వ్యాఖ్యలే గుర్తొస్తాయి. గతేడాది మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజా సింగ్ పై కేసు నమోదు అయ్యింది.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రతి విషయంపై తనదైనశైలిలో స్పందించే ఈ ఎమ్మెల్యే దాదాపుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదైంది. కాకపోతే ఈసారి హైదరాబాద్ లో కాదు.. ముంబయి పోలీసులు రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఒక సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాజా సింగ్ పై ఐపీసీ సెక్షన్ 153ఏ 1(ఏ) కింద కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 29న ముంబయిలో సకల్ హిందూ సమాజ్ సోషల్ యాక్టివిటీ నిర్వహించేందుకు అనుమతి కోరింది. శివాజీ పార్క్ నుంచి దాదర్ లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు ర్యాలీ నిర్వహించేందుకు పర్మిషన్ కోరారు. అందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. వీరి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. మహిళల దుర్వినియోగం, మహిళల భద్రత, వారి గౌరవానికి ఆటంకం కలిగించే విషయాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల అనుమతితోనే ఈ మార్చ్ జరిగింది.
కానీ, ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే రాజా సింగ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన మాట్లాడిన వీడియో కూడా వైరల్ గా మారిందని తెలిపారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న మరే ఇతర నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. రాజా సింగ్ మాత్రం ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలు ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది రాజా సింగ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాజా సింగ్ పై మరో కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mumbai police registered FIR against suspended BJP MLA T Raja Singh over his hate speech during a public meeting in Mumbai on 29th January. FIR registered under IPC section 153A 1(a): Mumbai Police
(File pic) pic.twitter.com/29cA3rTl2g
— ANI (@ANI) March 30, 2023