ఇటీవల పలువురు సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార వేత్తలకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగడం.. అందులో కొన్ని ఫేక్ కాల్స్ గా కొట్టి పడేయటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ అతని కుటుంబ సభ్యులను హతమారుస్తానని ఓ వ్యక్తి రిలయన్స్ ముంబైలోని హర్స్‌కిసన్‌దాస్ ఆస్పత్రికి వరుసగా ఫోన్ చేసి బెదిరించాడు. అప్రమత్తమైన రిలయన్స్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్జల్ అనే యువకుడు ఇవాళ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఫోన్ చేసి ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఫోన్ నంబరు ఆధారంగా అఫ్జల్ ని అరెస్టు చేసినట్లు ముంబయిలోని డీడీ మార్గ్ పోలీసులు వెల్లడించారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపుల నేపథ్యంలో ముఖేష్ నివాసమైన ఆంటిలియా వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
The Reliance Foundation Hospital had filed a complaint about receiving calls posing threat to Ambani and his family.https://t.co/QThPfqfbGv
— Hindustan Times (@htTweets) August 15, 2022
ఇది చదవండి: బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌కు వేధింపులు….
ఇది చదవండి: కొడుకు జీతం నెలకు 5 లక్షలు.. 70 ఏళ్ల అమ్మ వృద్ధాశ్రమంలో! …