దేశంలోని పలు ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా ఉండవు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి వేళ్లలో వాహనాలు గుంతల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పరిష్కరం కావు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు మాత్రం తాము ఉన్నది ప్రజల కోసమేనని, వారి సమస్యల పరిష్కారాన్నికి చొరవ చూపుతారు. కొందరు ప్రజల సమస్యలను తీర్చేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా ఓ మంత్రి ప్రజల కోసం ఓ శపథం చేశారు. తన నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితి మెరుగయ్యే వరకు తాను చెప్పులు లేకుండానే తిరుగుతానని ప్రతిజ్ఞ చేశారు. మరి ఆ మంత్రి ఎవరు? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రిగా ప్రధుమన్ సింగ్ తోమర్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గ్వాలియర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని రోడ్లను తనిఖీ చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్లను ఆయన పరిశీలించారు. రహదారులన్ని గుంతలు, రాళ్లలతో దారుణంగా ఉన్నాయి. ఈక్రమంలో అక్కడే ఉన్న స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ గుంతలమయంగా మారిన ఆ రహదారిపై తాము నడవలేకపోతున్నామని, నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు మంత్రి ముందు వాపోయారు. దీంతో అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు.. ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారని అధికారులపై మంత్రి మండిపడ్డారు. వెంటనే రహదారులను బాగుచేయాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వెంటనే రోడ్లు బాగు చేయిస్తామని,రహదారులు మెరుగయ్యే వరకు తాను చెప్పు ధరించనని శపథం చేశారు. వెంటనే తన పాదాలకు ఉన్న షూలను తీసి చేతి పట్టుకున్నాడు. ఇంకా మంత్రి మాట్లాడుతూ.. తాను చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడే ఇతరలు బాధ తనకు తెలుస్తుందన్నారు. గ్వాలియర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మెరుగయ్యే వరకు తాను చెప్పులు, బూట్లు ధరించనని అన్నారు. తాను చెప్పులు లేకుండానే ఉంటూనే రహదారులు పనులు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ పర్యవేక్షిస్తానని ఆయన చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ తెలిపారు.
MP Energy Minister Pradhuman Singh Tomar walked barefoot while inspecting pothole-ridden roads in Gwalior (20.10)
He said, “I’ve sacrificed footwear so that I can treat the pain I experience that others do while walking barefoot. I’ll daily monitor that work is done soon.” pic.twitter.com/5c5nddtpV6
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022
Gwalior | I’ve given strict orders to officials to immediately start repair work on these roads & make them walkable. Action will be taken against negligent officials: Madhya Pradesh Energy Minister Pradhuman Singh Tomar (20.10) pic.twitter.com/JKb5zsdG7H
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022