క్రికెట్ బెట్టింగ్ గురుంచి అందరికి విదితమే. ఈ పేరు చెబితే ఎక్కడ పోలీసులు పట్టుకుంటారో అన్న భయంతో కొత్తగా ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. ఇందులో మొదటగా ప్లేయర్లను ఎంచుకొని ఒక జట్టును క్రియేట్ చేయాలి. అనంతరం తమ జట్టే గెలవాలని బెట్టింగ్ కాయడం. అందులో విజయం సాధిస్తే ఇదిగో ఇతనిలా కోటీశ్వరులయ్యాం..! అని పేరు తెచ్చుకోవడం..
అదృష్టం ఎప్పుడు, ఎవరిని తలుపు తడుతుందో ఊహించలేం. కొందరు వజ్ర వైడుర్యాలను సొంతం చేసుకొని కోటీశ్వరులు అయితే, మరొకొందరు ఇలా జూదంలో నెగ్గి కోటీశ్వరులు అవుతున్నారు. ఏదేమైనా అతని ప్రయత్నం అతని పేదరికాన్ని దూరం చేయడమే కాకుండా జీవితంపై అతనికి భరోసా కల్పించింది. మధ్యప్రదేశ్, బర్వానీ జిల్లాకు చెందిన డ్రైవర్ షహబుద్దీన్ మన్సూరి ఆన్లైన్ గేమింగ్ యాప్‌లో కేవలం 49 రూపాయలు పెట్టుబడి పెట్టి కోటిన్నర గెలిచాడు. ఇది ఒక రాత్రికే సాధ్యమయ్యిందా! అంటే కాదు దీని వెనుక రెండేళ్ల శ్రమ దాగుంది. అతనికి ఇది ఎలా సాధ్యమైంది..? రెండేళ్ల కష్టమేంటో తెలియాలంటే ఇదే చదివేయండి.
‘జూదం ఆడటం నేరం..’ ఈ విషయం అందరికీ తెలుసు. మొదట వచ్చినట్లే కనిపించినా ఆ తరువాత అసలు.. అందులో వచ్చిన లాభం మొత్తం కలిపి నిర్వాహకుల చెంతకే చేరుతుంది. ఇలాంటి జూదపు గేములు బారిన పడి జీవితాలు నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ మన్సూరి ఈమార్గాన్నే ఎంచుకున్నాడు. గత రెండేళ్లుగా ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ యాప్ లో పెట్టుబడి పెడుతున్నాడు. ఏనాడూ అతడు పెద్ద మొత్తంలో గెలిచింది లేదు. అయినప్పటికీ నమ్మకాన్ని కోల్పోకుండా అలానే టీం క్రియేట్ చేయడం.. కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం చేసేవాడు. ఇలానే ఐపీఎల్ 2023 భాగంగా ఆదివారం కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగగా.. మన్సూరి తన మొబైల్ యాప్ లో క్రికెట్ టీంను ఏర్పాటుచేసి 49 రూపాయల పందెంలో ఎంట్రీ ఇచ్చాడు. ఇంకేముంది అతడి జట్టే అగ్రస్థానంలో నిలిచింది. దీని ద్వారా అతడు కోటిన్నర(1.5 కోట్లు) గెలుచుకున్నాడు.
ఇప్పటికే షాహబుద్దీన్ తన యాప్ వాలెట్ నుంచి రూ. 1.5 కోట్లలో రూ. 20 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. అందులో రూ.6 లక్షలు పన్నులకు పోగా, మిగిలిన రూ. 14 లక్షలు అతని బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బుతో మన్సూరీ కొత్త ఇళ్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చూశారుగా.. రాత్రికి రాత్రే లక్ ఎలా కలిసొచ్చిందో.. అలా అని ఇతనిని ఆదర్శంగా తీసుకొని మీరు రంగంలోకి దిగకండి. ఇందులో గెలిచిన వారు ఇలా అరుదు. డబ్బు అటువైపు పోవడం తప్ప.. ఇటువైపు వచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఇతనిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A driver from Madhya Pradesh’s Barwani district won Rs 1.5 crore by investing Rs 49 in an online gaming app https://t.co/kX4EijITMU
— IndiaToday (@IndiaToday) April 4, 2023