అధికార ప్రతినిధి అంటే ప్రజలను దోచుకోవడం కావడం కాదు, ప్రజలను దోచుకుంటున్న దొంగలను పట్టుకోవడం అని నిరూపించాడు.. ఓ ఎంపీ. మహిళ మెడలో చైన్ కొట్టేసి పారిపోతున్న దొంగలను సినిమా స్టయిల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నాడు.
ఇటీవల కాలంలో దొంగలు చెలరేగిపోతున్నారు. గతంలో ఇళ్లు, షాపులు లూటీ చేసే దొంగలు, ఇప్పుడు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు.. బైక్ పై దూసుకురావడం మెడలో గొలుసు లాక్కెళ్లడం దొంగలకు పరిపాటి అయింది. ఇలాంటి గొలుసు దొంగతనాలు నిత్యం ఏదో ఓ చోట మనం చూస్తూనే ఉన్నాం. ఇలానే ఓ మహిళ మెడలో ముగ్గురు దొంగలు లాక్కెళ్ళే ప్రయత్నం చేయగా, ఓ ఎంపీ.. వారి అనుచరులు దొంగలను వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటన పాట్నాలో జరిగింది. ఆ వివరాలు..
పాట్నాలో బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిరిస్ గ్రామానికి చెందిన సరిత అనే మహిళ.. అనారోగ్యంతో ఉన్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. తిరిగి తన భర్తతో బైక్ పై వస్తుండగా దారిలో ముగ్గురు యువకులు వారిని కొంత దూరం వరకు వెంబడించారు. అనంతరం సరిత మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కుని పారిపోయారు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన మహిళ రోడ్డు పక్కన నిల్చొని లబోదిబోని ఏడుస్తుండగా, అదే సమయంలో కారులో ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ అటుగా వెళ్తున్నారు. వెంటనే ఇదంతా గమనించిన ఎంపీ తన అనుచరులను, డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో వారు దొంగలను వెంబడించారు.
అలా సినిమా స్టయిల్‌లో దొంగలను వెంబడిస్తుండగా, ఎంపీ కారు దొంగలకు దగ్గరగా వెళ్లగానే నిందితులు ఎంపీకి గన్ గురిపెట్టి కాలుస్తామని బెదిరించారు. అయినప్పటికీ అయన వారిని కారుతో వెంబడించారు. చివరకు మధుపూర్ అనే గ్రామ సమీపంలో దొంగలు పారిపోతున్న బైక్ బురదలో కూరుకుపోయింది. వారు బురదలో పడిపోయి.. లేచి పొలాల వైపు పారిపోతుండగా ఎంపీ బాడీగార్డ్ లు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు పట్టించారు. నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు. వారి నుండి ఒక పిస్టల్, తుపాకీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
माननीय सांसद @SushilSinghMP सासाराम से औरंगाबाद लौट रहे थे, तब ही डेहरी सोन पुल पर एक महिला सरिता गुप्ता जी रोती हुई दिखी।
उन्होंने रोने का कारण पूछा तो महिला ने दिन दहाड़े ही चैन लूट का मामला बताया और भागते हुए अपराधियों को दिखाया।
— BJP Bihar (@BJP4Bihar) May 5, 2023