మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. నిండు గర్భిణిగా ఉన్నవారు ప్రత్యేక పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిస్తే.. ఆయా ఘటనల పేర్లే పెడుతుంటారు. గత 2020 కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తూర్పుగోదావరిలో ఒక కుటుంబం అప్పుడే పుట్టిన ఆడ బిడ్డకు `కరోనా` అని పేరు పెట్టుకుంది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అభిమాని కుటుంబంలో పుట్టిన బిడ్డకు `సంకల్ప` అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఆయా సందర్భాల్లో బిడ్డలకు జన్మనిస్తే ఆ పేర్లు పెట్టుకోవడం చూస్తున్నాం.
తాజాగా ఉత్తరప్రదేశ్ లో అప్పుడే పుట్టిన మగబిడ్డకు ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అని పేరు పెట్టారు. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యూపీలోని అమ్రోహా జిల్లాలో ఉన్న నాన్పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలారోజుల క్రితం యూపీ టెట్కు దరఖాస్తు చేసింది. అమ్రోహాలోని గజ్రౌలా ప్రాంతంలోని రమాబాయి డిగ్రీ కాలేజీ సెంటర్ లో ఆదివారం పరీక్ష రాసేందుకు రేణు దేవి వచ్చింది. పరీక్ష రాస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కేంద్రం నిర్వాహకులు వెంటనే అంబులెన్స్ ని పిలిపించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇది కూడా చదవండి: నన్ను ఒంటరిగా వదిలేశారు! నటి సుధ ఎమోషనల్ కామెంట్స్!
తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తాను టెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సమయంలో పుట్టాడు కనుక యూపీ టెట్ పరీక్షకు గుర్తుగా.. తన బాబుకు ‘టెట్’ అని పేరు పెట్టినట్టు రేణు దేవి దంపతులు తెలిపారు. ఇప్పుడు ఇది విచిత్రం అనిపించినా.. పిల్లాడు ఓ 20 ఏళ్ల తర్వాత తలుచుకుంటే.. మధుర స్మృతులుగా మిగిలిపోతాయి అంటున్నారు నెటిజన్లు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.