చదువుపై ఆసక్తికి వయస్సుతో సంబంధంలేదు. కొందరు కొన్ని కారణాలతో చదవాలని ఆసక్తి ఉన్న మధ్యలో ఆపేస్తారు. అలా ఒకే కుటుంబ నుంచి పెద్ద వాళ్లు చిన్న వాళ్లు పరీక్షలు రాయడం అక్కడక్కడ జరుగుతుంటాయి. తండ్రి కూతురులు కలసి పరీక్షలు రాయడం, అవ్వ పదో తరగతి పరీక్షలు రాయడం వంటివి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. వారికి చదువుపై ఉన్న ఆసక్తికి అవి నిదర్శనం. తాజాగా ఓ తల్లీ కొడుకు కలిసి మెట్రిక్ పరీక్షలు రాస్తున్నారు. చదువు మధ్యలో ఆపేసి పెళ్లి చేసుకున్న ఆమె పట్టుదలతో చదువుకుని కొడుకుతో కలసి మెట్రిక్ పరీక్షలు రాసింది. ఈ ఘటన ఒరిస్సాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం మండలం పూజారిపుట్ గ్రామంలో జ్యోత్స్న పాఢి(తల్లి), అలోక్‌నాథ్ పాత్రొ(కొడుకు) శుక్రవారం పదో తరగతి పరీక్షలు రాశారు. తల్లి జయపురం ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అభ్యర్థిగా, కొడుకు పూజారిపుట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ విద్యార్థిగా పరీక్షలకు హాజరయ్యారు. తన కొడుకు ఇంటి వద్ద నుంచే పదో తరగతి చదువును కొనసాగించడం చూసిన.. జ్యోత్స్న, తాను కూడా అర్ధాంతరంగా ముగించిన చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది. అంతకుముందు 15 ఏండ్ల కిందట వివాహం కారణంగా ఆమె చదువు ఆగిపోయింది.
ఆమె భర్త త్రినాథ్ పాత్ర అక్కడే విలేజ్‌లో జాతీయ బ్యాంకు కియోస్క్‌ను నడుపుతున్నాడు. మళ్లీ చదువు కొనసాగించాలనే ఆమె కోరికను గమనించి భర్త.. పాఠశాలలో చేర్పించాడు. భర్త సహకారం అందించడంతో ఇంటి నుంచే తన కొడుకుతో కలిసి పది పరీక్షలు సిద్ధమైంది. ఇప్పుడు ఇద్దరు కలిసి పరీక్షలకు హాజరవుతున్నారు. భర్త త్రినాథ్‌ప్రసాద్ పాత్రొ ప్రోత్సాహంతో అర్ధాంతరంగా ముగించిన చదువును తిరిగి ప్రారంభించినట్లు జ్యోత్స్న తెలిపారు. మరి.. చదువు మీద ఉన్న ఆసక్తితో కష్ట పడి చదివి ఇలా కొడుకుతో కలసి పది పరీక్షలు రాస్తున్న ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.