ఎటువంటి అనారోగ్య సమస్యలు కాదు కదా.. అలసటగా కూడా లేని సమయంలో వచ్చి గుండె నొప్పి మెలిపెట్టేస్తోంది. సాయం కోసం పిలిచే సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. ఆసుపత్రులకు తీసుకెళ్లేంత ఛాన్స్ ఇవ్వడం లేదు.
ఊహించని విధంగా గుండెపోటు మనుషుల ప్రాణాలు బలితీసుకుంటుంది. ఆనందం, విషాదంలోనూ ఊపిరి తీస్తోంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కాదు కదా.. అలసటగా కూడా లేని సమయంలో వచ్చి నొప్పి మెలిపెట్టేస్తోంది. సాయం కోసం పిలిచే సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. ఆసుపత్రులకు తీసుకెళ్లేంత ఛాన్స్ లేకుండా చేస్తోంది. ఒంటరిగా ఉన్న సమయాల్లో హార్ట్ స్ట్రోక్ వస్తే.. కాలు కదపనీయడమే కాదు గొంతు కూడా పెగలనివ్వడం లేదు. చూస్తుండగానే ప్రాణాన్ని హరిచేస్తుంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో చిన్నారుల నుండి వృద్ధుల వరకు అనేక మంది చనిపోయారు. అయితే వీరిలో యువకులు, చిన్నారులు చనిపోయిన ఘటనలు గుండెలను పిండేస్తున్నాయి.
కేంద్ర మంత్రి, బిజెపి నేత ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు, మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్ ఎమ్మెల్యే జలం సింగ్ పటేల్ కుమారుడు మణి నాగేంద్ర అలియాస్ మోను ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన గుండె పోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటలకు గదిలోకి వెళ్లిన మోను.. సాయంత్రం అయితనా తలుపు తెరవకపోవడంతో.. అనుమానం వచ్చి చూడగా మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మోను పటేల్ ఇటీవల ఓ కేసులో అరెస్టు.. నిర్దోషిగా తేలడంతో విడుదలయ్యాడు. మోను పటేల్‌కు జిల్లా యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన మరణవార్తతో గోటేగావ్‌తో పాటు నర్సింగపూర్ జిల్లా వ్యాప్తంగా శోకసంద్రం నెలకొంది.