విద్యకు దూరమైన పిల్లలే లక్ష్యంగా ఓ సంస్థ అద్భుతమైన ఆలోచన చేసింది. బస్సునే తరగతి గదిగా మార్చి.. ఆధునిక వసతులతో మొబైల్ స్కూల్ మార్చేసి పిల్లలకు విద్యనందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
విద్యా అనేది విద్యార్ధులో విజ్ఞానాన్ని పెంపొందించి.. వారి భవిష్యతుల్లో వెలుగులు ఇస్తుంది. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు విద్యను తప్పనిసరిగా అందించాలి. అయితే కొందరు మాత్రం పేదరికంగా కారణంగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. మరికొందరు తమకు అందుబాటులో లేదనే కారణంతో పిల్లలను చదువుకు దూరం చేస్తుంటారు. అయితే ఇలాంటి పిల్లలను కొన్ని సంస్థలు ఆదుకుంటాయి. ఆర్థికం సాయం, ఉచిత డ్రెస్ లు, పుస్తకాలు అందించడం వంటివి చేస్తుంటాయి. అయితే ఓ సంస్థ మాత్రం ఏకంగా విద్యార్థుల వద్దకు కదిలే బడిని తీసుకొచ్చింది. మరి.. ఆ సంస్థ ఏంది.. ఆ కదిలే బస్సు ఎక్కడ? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ కారణంతో కూడా పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుడదని గుజరాత్ కు చెందిన ఓ సంస్థ అద్భుతమైన ఆలోచన చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతానికి చెందిన విద్యాకుంజ్-విద్యాఫిఠ్ అనే సంస్థ ఈ అద్భుత కార్యానికి శ్రీకారం చుట్టింది. విద్యకు దూరంగా ఎక్కడో మురికి వాడలో, పుట్ పాత్ లపై నివసించే పేద చిన్నారులకు విద్యను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ విద్యార్థుల కోసం బస్సునే బడిగా మార్చి వారి వద్దకే తీసుకెళ్లింది. ఆ బస్సులోనే బెంచీలు, టీవీ, ఇంటర్ నెట్, ఫ్యాన్, లైట్లు వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. అంతేకాకకుండా విద్యార్థులకు తరగతి అనే అనుభూతి వచ్చేలా బస్సును తీర్చిదిద్దారు.పేద పిల్లలు ఉండే ప్రాంతానికే రోజూ ఆ సంస్థ ప్రతినిధులు బస్సులో వెళ్తుంటారు.
పిల్లలను బస్సులోకి జాగ్రత్తగా తీసుకొచ్చి.. వినోదాత్మకంగా పాఠాలు బోధిస్తున్నారు. మురికివాడల్లో, పుట్ పాత్ పై ఉండే పేద పిల్లలకు విద్య అవసరమని.. అది అందించడమే తమ ఆశయమని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం బస్సులో 32 మంది విద్యార్థులే ఉన్నారని, ఒకవేళ ఈ సంఖ్య పెరిగితే మాత్రం మూడు గంటల చొప్పున రెండు బ్యాచ్ లుగా ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఈ బస్సు బడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..ఈ బస్సు బడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.