నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరు మొబైల్ ను వినియోగిస్తున్నారు. వీటి వాడకంతో పాటు నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే దాదాపు చాలా మంది రీఛార్జ్ చేయించుకుని ఫోన్ వినియోగించడమే తప్ప.. వాటి రేట్ల విషయాలను పరిశీలీంచడం చాలా తక్కువగా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో రీఛార్జ్ ప్లాన్ల రేట్లు బాగా పెరిగిపోయాయి. టెలికాం కంపెనీలు చిన్న చిన్నగా డేటా, వాయిస్ రేట్లు పెంచడం మెుదలుపెట్టాయి. ఇప్పుడు మరింత ధరల వడ్డనకు సిద్ధమయ్యాయి. ఇటీవల ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. రానున్న కాలం టెలికాం సంస్థలు మరింత మోత మోగించేట్లు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు టెలికాం సంస్థలు ఉన్నట్టుండి ధరలపై ఎందుకు పడ్డాయి..? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నేటికాలంలో నెట్ లేని ఫోన్ అంటూ ఏది లేదు. కారణం ప్రతి ఒక్కరు నెట్ ద్వారా ఫోన్ లో అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఫ్లోన్లో చేసే ప్రతి పనికి నెట్ అవసరం అవుతోంది. ఈ నెట్ ఎంత వేగంగా ఉంటే మన ప్రశ్నలకు సమాధానాలు అంతే వేగంగా వస్తుంటాయి. అయితే ఈ నెట్ ను ఆయా టెలికాం సంస్థలు ఇచ్చే ఫ్లాన్ల ప్రకారం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఒకప్పుడు 1జీబీ డేటాను రీఛార్జీ కోసం 200పైగా చెల్లించాల్సి వచ్చేది. దానికి కూడా సెకన్ల చొప్పున డేటా అయిపోతుండేది. దీంతో ఎంతో పొదుపుగా డేటాను ఉపయోగించుకునే వారు. అయితే కాలం మారింది.. కాలంతో పాటు నెట్ వర్క్ లోనూ అనేక మార్పులు వచ్చాయి.
ముఖ్యంగా 4జీ తీసుకొచ్చిన విప్లవం అంతాఇంతా కాదు. ఈ 4జీ కారణంగా మొబైల్ వినియోగంలో పెనుమార్పులు సంభవించాయి. 2015లో జియో సంస్థ 4జీని లాంచ్ చేసిన తరువాత టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి వరకు ఉన్న నెట్ వర్క్ ధరలు అమాంతం దిగి వచ్చాయి. అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ వంటివి పరిమిత డబ్బులకు అందుబాటులోకి వచ్చాయి. జీయో సంస్థ ఏర్పాటు చేసిన కొత్త బాటలోకే మిగిలిన టెలికాం సంస్థలు వచ్చాయి. ధరలను తగ్గించి వినియోదారులను కాపాడుకునే పనిలో పడ్డాయి. దీంతో మార్కెట్ పోటీ బాగా పెరిగింది. అయితే కాలం మారుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి.. ఇప్పుడు 4జీ పోయి.. 5జీ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం ఇస్తున్న ధరలకే హై స్పీడ్ నెట్ అందిచడం అనేది టెలికాం సంస్థలకు తలకుమించిన భారమైంది. దీంతో ఈ ఖర్చులను వినియోదారుల నుంచి వసూలు చేసేందుక సంస్థలు రెడీ అయ్యాయి. ఇటీవల పెరిగిన ఎయిర్ టెల్ నెట్ వర్క్ ధరలు చూస్తే ఆ విషయం అర్ధమౌతుంది. ఎయిర్ టెల్ అందిస్తున్న 99 ప్లాన్ ను తొలగించి 155కు పెంచింది. పలు రాష్ట్రాల్లో అతి తక్కువ రీఛార్జైన ఈ ప్లాన్ ను నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం టెలికాం ఆపరేట్లు అందిస్తున్న బేస్ ప్లాన్ రేటు 57 శాతానికి పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ అన్ని సంస్థలు ఇంచుమించు ఎయిర్ టెల్ బాటలోనే ఉన్నాయి. కొన్ని మొబైల్ నెట్ వర్క్ సంస్థలు తమ బేస్ ప్లాన్ రేట్లను అమాంతం పెంచగా మరికొన్ని పెంచే పనిలో ఉన్నాయి. టెలికాం కంపెనీలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారుతుంది.
ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్ల ధరలకను 10 శాతం మేర పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్దమైనట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్ టెల్ తో సహా మిగిలిన సంస్థల ఆపరేటర్లు రాబోయే మూడేళ్లలో తమ ప్లాన్ల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితే కారణమని టెలికాం సంస్థలు చెప్తున్నా.. తమకు తలకు మించిన భారమంటున్నారు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు. ఇలా అన్ని రంగాల్లో ధరలు పెంచుకుంటూ వెళ్తే.. అభివృద్ధి కంటుబడుతుందని, డిజిటల్ భారత్ వైపు అడుగులు వేయడానికి కష్టమౌతుందని ఆర్ధిక నిపులు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఇలా చుక్కల చూపిస్తున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.