రుణమాఫీ అనే పదం రైతులకు ఎంతో సంతోషాన్నిచ్చే పదం. రుణమాఫీ అనేది రైతులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అస్త్రమే. రైతులు గెలవాలన్నా, రాజకీయ నాయకులు గెలవాలన్నా రాజకీయ డిక్షనరీలో రుణమాఫీ అన్న పదం ఉండాల్సిందే. అధికారంలోకి రావడం కోసం ఉపయోగించే హామీ అస్త్రాల్లో ఈ రుణమాఫీ ఒకటి. రుణమాఫీ చేస్తామని చెప్తే రైతుల ఓట్లు పడతాయన్న నమ్మకం రాజకీయ నాయకులది. ఈ క్రమంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొంతమంది మాట తప్పరు, మడమ తిప్పరు. కొంతమంది మాత్రం ఇచ్చిన హామీలను మర్చిపోతారు. అయితే తాము అలా కాదని.. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
బహిరంగ ర్యాలీలో భాగంగా ఓ ఎమ్మెల్యే రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎన్ని లోన్లు అయినా తీసుకోండి. ఎంత లోన్ అయినా తీసుకోండి. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మొత్తం రుణమాఫీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సతీమణి జేడీ(ఎస్) ఎమ్మెల్యే అనిత కుమార స్వామి ఈ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్న కుమారస్వామి, ఆయన సతీమణి రైతులకు హామీ ఇచ్చారు. ‘ఎన్ని లోన్లు కావాలో తీసుకోండి. ఒక్కసారి మేము అధికారంలోకి రాగానే 24 గంటల్లో రుణమాఫీ చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
రైతులు ఎన్ని లోన్లు కావాలన్నా తీసుకోండి, మేము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో మాఫీ చేస్తామని ఇది వరకే కుమారస్వామి హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అని ఎమ్మెల్యే అనిత కుమారస్వామి అన్నారు. ‘మీకు ఎంత లోన్ కావాలంటే అంత లోన్ తీసుకోండి. మీ బాకీ మేము తీరుస్తాం’ అని రైతులతో అన్నారు. రైతులకు ఎన్ని లోన్లు అయినా తీసుకోండి, ఎంత లోన్ అయినా తీసుకోండి అని ప్రకటించిన ఎమ్మెల్యేపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తారా? లేదా? రైతులకే కాకుండా నిరుద్యోగులకు కూడా ఇలాంటి ఆఫర్ ఇస్తే బాగుంటుంది కదా. అది సరే అసలు రైతులకు లోన్లు ఇచ్చేది ఎవరబ్బా? ఎన్ని లోన్లు కావాలంటే అన్ని లోన్లు, ఎంత కావాలంటే అంత లోన్ ఏ బ్యాంకు ఇస్తుందబ్బా? ఇవ్వదని తెలిసే ఇలా మాటల గారడీ చేస్తున్నారా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి రాజకీయ మేధావుల్లారా.