రాజకీయ నేతల పిల్లల అంటే.. వారు ఎలాంటి తప్పులు చేసినా, నేరాలు చేసినా.. శిక్ష పడదు.. తల్లిదండ్రులు వారిని కాపాడాతారు, పోలీసులు కూడా రాజకీయ నేతల పిల్లల విషయంలో చూసి చూడనట్లు ఉంటారనే భావన సమాజంలో వెళ్లూనుకుపోయింది. అయితే అందరూ రాజకీయనేతలు ఇలానే ఉంటారా అంటూ కాదు అంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. వైవిధ్యమైన సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తోన్న స్టాలిన్ తన జీవితంలో చోటు చేసుకున్న అంశాలను వివరిస్తూ.. ‘‘ఉంగళిల్ ఒరువన్’’ (మీలో ఒకడు) పేరిట స్వీయ చరిత్ర రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం!
ఇటీవలే ఈ పుస్తకం తొలి భాగాన్ని ఆవిష్కరించారు. దీనిలో ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. దానిలో ఒకటి స్టాలిన్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. స్టాలిన్‌ని స్వయంగా ఆయన తండ్రి కరుణానిధి మారనే దగ్గరుండి పోలీసులు చేత అరెస్ట్ చేయించారట. ఆ సంఘటన వివరాలను పుస్తకంలో వెల్లడించారు. ‘‘ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమనర్జెన్సీ విధించిన సమయం అది. అప్పట్లో పోలీసులు గోపాలపురంలోని మా ఇంటికి వచ్చి.. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని తెలిపారు. తమ వద్ద సెర్చ్ వారెంట్ కూడా ఉందనన్నారు’’.
ఇది కూడా చదవండి: పక్కకు తప్పుకుని ఒకరి ప్రాణాలు నిలిపిన ముఖ్యమంత్రి.. వీడియో వైరల్
అప్పుడు కరుణానిధి.. స్టాలిన్ మధురాంతకంలో ఉన్నాడని.. వచ్చిన వెంటనే తెలియజేస్తానని వారికి తెలియజేశాడు. మరుసటి రోజు స్టాలిన్ తిరిగి వచ్చాక పోలీసులుకు ఫోన్ చేసి.. తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని కరుణానిధి వారికి తెలిపాడు. దీంతో మీసా యాక్ట్ కింద స్టాలిన్‌ని అరెస్ట్ చేశారు. ఆ సయమంలో చాలామంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ‘‘వారితో పాటే నేను కూడా అని మా నాన్న భావించారు. అందుకే స్వయంగా ఆయన నన్ను పోలీసులకు అప్పగించారు’’ అని స్టాలిన్ రాసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు సీఎం స్టాలిన్.. ఆకస్మిక తనిఖీతో హడలిపోయిన పోలీసులు.. వీడియో వైరల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.