ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా డెల్టావేవ్ భయపెడితే.. ప్రస్తుతం కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. ఇక ప్యూర్టో రికోలో జరగాల్సిన మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. పలుపురు పోటీదారులు కోవిడ్ పాజిటివ్ రావడంతో పోటీని రద్దు చేస్తున్నట్లు గురువారం నిర్వాహకులు ప్రకటించారు. ఫైనల్స్ ఈవెంట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు మిస్ వరల్డ్ నిర్వాహకుల నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంతే కాదు కంటెస్టెంట్లందరూ ప్యూర్టోరికోలో ఐసొలేషన్ లో ఉన్నారు.
కరోనా బారిన పడుతున్న కంటెస్టెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో మిస్ వరల్డ్ ఫైనల్స్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు అధికారక ప్రకటన ద్వారా నిర్వాహకులు వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు. వైరాలజిస్టులు, మిస్ వరల్డ్ 2021 ఈవెంట్‌ను పర్యవేక్షించడానికి నియమించిన వైద్య నిపుణులు, ప్యూర్టో రికో హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం జరిగింది.
ఇదీ చదవండి : కెప్టెన్ అయిన ఆనందంలో.. భార్యకి భారీ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ!
కోవిడ్-19 పాజిటివ్ కేసులు గుర్తించిన తర్వాత అదనపు భద్రతా చర్యలు కూడా చేపట్టారు. కాగా, 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా- 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే ఇంతలోనే కరోనా బారిన పడింది. ఈ అమ్మడు హైదరాబాదులో ఎఫ్ఐఐటీ జేఈఈలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదివింది.