ఢిల్లీలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ పేరుతో వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని 'సెట్టింగ్ ది పీస్' అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు.
ఢిల్లీలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ పేరుతో వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రామాన్ని ‘సెట్టింగ్ ది పీస్’ అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్ సదస్సులో 2030కు నిర్దేశించిన వాతావరణ లక్ష్యాలను భారత్ తొమ్మిదేళ్ల ముందే సాధించిందని ఆయన తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించడానికి అమలు చేస్తున్న చర్యల గురించి మంత్రి మాట్లాడారు. అంతేకాక అటవీ, పర్యావరణం పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి కూడా ఆయన వివరించారు. రిఫ్లెక్షన్స్ ఆన్ లైప్.. ఇండియాస్ పాత్ టూ గ్రీన్ అనే అంశంపై భూపేందర్ యాదర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. “2015లో జాతీయంగా నిర్ణయించిన విరాళాలను 2021లోనే సాధించింది. అంతేకాక పారీస్ జరిగిన వాతావరణ సదస్సులో నిర్దేశించిన లక్ష్యాలను తొమ్మిదేళ్ల ముందే సాధించాము. తాము 2015 కట్టుబాట్ల ప్రకారం 2021లో 165 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలనే మా లక్ష్యాన్ని కూడా సాధించాము.
మేము మెరుగు పర్చిన ఎన్డీఎస్ లను సమర్పించాము. భారతదేశం పునరుత్పాదక రంగంలో భారీగానే పెట్టుబడులు పెట్టింది. అలానే పునరుత్పాదక శక్తిలో మన సామర్థ్యం ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ రేటుతో పెరుగుతోంది. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు భూమి, సముద్ర ప్రాంతాలలో 30 శాతం రిజర్వ్ చేయడానికి కూడా మేము అంగీకరించాము. అంతేకాక 16 ప్రాంతాలను జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లుగా ప్రకటించాము. వాతావరణ మార్పుల విషయానికి వస్తే.. మనం సమస్యలో భాగం కాకుండా పరిష్కారంలో భాగం కావాలి” అని ఆయన అన్నారు