మనం ఇతర ప్రాంతాలకు వెళ్లనప్పుడు హోటల్ లో గదులు తీసుకుంటాము. అయితే కొన్ని చోట్ల హోటల్ గదుల అద్దెలు సాధారణంగా ఉంటే .. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కులు చూపిస్తాయి. ఇక పెద్ద పెద్ద హోటల్ లో గదుల అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ లోని ఓ మినీ హోటల్ లో కేవలం 20 రూపాయిలకే రూమ్ లభిస్తుంది.
మనం ఇతర ప్రాంతాలకు వెళ్లనప్పుడు హోటల్ లో గదులు తీసుకుంటాము. అయితే కొన్ని చోట్ల హోటల్ గదుల అద్దెలు సాధారణంగా ఉంటే .. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కులు చూపిస్తాయి. ఇక పెద్ద పెద్ద హోటల్ లో గదుల అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సామాన్యులు అటువైపు కూడా చూడరు. అలానే కొందరు కనీసం రూ. 100 కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి కోసం కేవలం 20 రూపాయలకే మినీ హోటల్ లో గది లభిస్తుంది. అంతేకాక ఇక్కడ ఆహారం కూడా చౌక ధరకే లభిస్తుంది. రూ.20కే గది అంటూ మీకు ఆశ్చర్యానికి కలిగిస్తున్న ఆ మినీ హోటల్ పశ్చిమ బెంగాల్ లో ఉంది. మరి.. అంత తక్కువ ధరకే ఆ హోటల్ లో గదులు ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
లో ఓ మినీ హోటల్ ను మహేంద్ర సర్కార్ అనే రిక్షవాల నడుపుతున్నాడు. అది కూడా మిగిలిన హోటళ్లతో పోలీస్తే చాలా తక్కువ ధరకే గదులను అద్దెకు ఇస్తున్నాడు. కేవలం రూ.20 చెల్లించి ఈ హోటల్ లో గదిని అద్దెకు తీసుకోవచ్చు. కేవలం గదులు మాత్రమే కాకుండా భోజనం సైతం అతి తక్కువ ధరకే అందిస్తున్నారు.ఈ ప్రాంతంలో పని చేయడం కోసం రోజువారీ కూలీలు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇలా పనుల నిమిత్తం వచ్చిన వారు కొన్నిసార్లు రెండు, మూడు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది.
ఆ పరిస్థితులో వారు తమకొచ్చే రోజువారీ కూలీతో సాధారణ హోటల్లో సైతం గదిని అద్దెకు తీసుకోలేరు. ఖర్చులకు భయపడి రోడ్లపైనే వారు నిద్రిస్తుంటారు. అయితే ఇలాంటి వారిని చూసిన మహేంద్ర మనస్సు చలించింది. దీంతో ఆ రోజు వారి కూలీలను దృష్టిలో ఉంచుకుని మహేంద్ర సర్కార్ ఇనుప రేకుల సహాయంతో తన ఇంటినే రెండంతస్తుల భవనంగా మార్చాడు. అందులోనే గదుల్లో.. ఓ మంచం, లైట్, ఫ్యాన్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వంటి సౌకర్యాలను కల్పించాడు. 24 గంటల పాటు ఉండేందుకు కేవలం రూ.20 వసూలు చేస్తున్నాడు.
దీంతో పాటుగా మాములు భోజనం రూ.30, చేపలు రూ.50, చికెన్ మీల్స్ రూ.60కే అందిస్తున్నారు. మహేంద్ర చేస్తున్న మంచి పనికి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాను రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తూనే.. పేద వారికి ఇలా సాయం చేస్తున్నాడు. మనకు ఉన్నంతలో పరులకు సాయం చేయాలనే పెద్దలు చెప్పిన మాటను మహేంద్ర చక్కగా పాటిస్తున్నారు. మరి.. ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.