ఇటీవల దేశంలో పలు రాష్ట్రాల్లో భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు సంబవించిన విషయం తెలిసిందే..
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంబవించింది.. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతగా చూపించింది. ఈ భూకంపం ఎంతటి భయానక ప్రళయాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. శిథిలాల కింద నుంచి మృతదేహాలను తీస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 44 వేలకు పైగా మరణాలు సంబవించినట్లు అధికారులు చెబుతున్నారు. భారత్ లో కూడా పలుమార్లు భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంబవిచింది.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదైందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ-ఎన్ సీఆర్ లోని పలు ప్రాంతాల్లో కొద్ది సేపటి క్రితం భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయి. దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖాండ్ లో పలు చోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4 గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. నేపాల్ లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంబవిచిందని.. ఈ భూకంపం లోతు 10 కిలోమీటర్ల ఉందని అధికారులు తెలిపారు. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదని అధికారులు తెలిపారు.