దేశ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ఇంట్లో, ఆఫీస్ లో ఉన్న సామాన్లు ఒక్కసారిగా కదిలిపోయాయని జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అన్నారోడ్ సమీపంలోని వైట్స్ రోడ్ ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
చెన్నైలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులంతా భయంతో వణికిపోయారు. ఇటీవల టర్కీ, సిరియాలో సంబవించిన భూ కంపం ఎంతటి భయానక వాతావరణం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి భూకంపం అనే పేరు వినిపిస్తే చాలు ప్రజలు భయంతో గజ గజలాడుతున్నారు. చెన్నైలోని అన్నాసాలైలోని నివాసాల్లో భూ ప్రకంపణలు రావడంతో నివాసితులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. రాయంపేట లాయడ్స్ రోడ్డు సమీపంలో సైతం భూమి స్వల్పంగా కంపించింది.. దాంతో ఒక అపార్ట్ మెంట్ లో ఉన్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.
సుమారు రెండు నుంచి మూడు సెకన్లపాటు భూమి కంపించిందని అధికాలు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ సహా ఎన్‌సీఆర్, హర్యానా, ఉత్తరాఖాండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తోపాటు అనేక ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. ఇదిలా ఉంటే అండర్ గ్రౌండ్ మెట్రో పనుల వల్ల భూ ప్రకంపణలు వచ్చి ఉంటాయని స్థానికులు చెబుతుండగా.. చెన్నై మెట్రో రైలు పనుల వల్ల కాదని అధికార యంత్రాంగం కొట్టిపడేసింది.
Little #Earthquake happened in Chennai pic.twitter.com/nDKpNcHOkR
— RAJA DK (@rajaduraikannan) February 22, 2023