ఉగాది పండుగను ప్రజలందరూ ఆనందంగా, ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. వారి ఆనందాన్నీ మరింత ఉత్సాహ పరిచేలా ఆకాశంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఆకాశంలో పదుల సంఖ్యలో ఉల్కలు భూమి మీదకు పడిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం రాత్రి.. మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన కొమురం భీమ్ ఆసిఫాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉల్కలు పడిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రజలు సెల్ఫోన్లతో వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో వైరల్ గా మారాయి.
#WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R
— ANI (@ANI) April 2, 2022