పెద్ద పెద్ద చదువులు చదివి.. చిన్న చిన్న పనులు చేయటం అందరి వల్లా కాదు. కానీ, కొంతమంది తాము అనుకున్నది సాధించటానికి ఏ పనినైనా ఇష్టంగా చేస్తారు. కష్టంతో కాకుండా ఇష్టంతో అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.
మనిషి- జంతువుకు తేడా మొత్తం ఆలోచనా విధానంలోనే ఉంటుంది. మనిషి ఆలోచనలే అతడ్ని ఓ ప్రత్యేకమైన జీవిగా తీర్చిదిద్దాయి. ఆశలు, ఆశయాలు.. కష్టాలు, నష్టాలు ఇలా అన్ని విషయాల్లో మనిషి ప్రత్యేకమైనవాడే. అందరూ కాకపోయినా.. కొంతమంది మనుషులు అనుకున్నది సాధించటం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు. ఇందుకు చదువుకున్న వాడు, చదువులేని వాడు అన్న తేడా ఉండదు. ఒక్కోసారి చదువులో ఫెయిల్ అయినవారే జీవితంలో ఉన్నత స్థితికి వస్తూ ఉంటారు. అలాంటి వారిలో ‘ ఎంబీఏ చాయ్ వాలా’ ఓనర్ ప్రఫుల్ బిల్లోర్ ఒకరు.
ఇతడు ఎంబీఏలో ఫెయిల్ అయ్యాడు. కానీ, జీవితంలో మాత్రం ఊహించని సక్సెస్ సాధించాడు. టీ కొట్టుతో కోట్లు సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు ఏమీ లేని స్థాయినుంచి ఇప్పుడు ఏకంగా 92 లక్షల రూపాయల ఖరీదైన కారు కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ 2016లో అహ్మదాబాద్‌లో ఎంబీఏ చదివేవాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల ఎంబీఏ చదువును మధ్యలోనే ఆపేశాడు. 2016లోనే ”మిస్టర్ బిలియనీర్ అహ్మదాబాద్ (ఎంబీఏ)” పేరిట ఓ టీకొట్టును పెట్టాడు. మొదట ఆశించినంత ఫలితాలు రాలేదు. తర్వాత వ్యాపారం పుంజుకుంది. టీ కొట్టు పేరు మార్చేశాడు. ‘ఎంబీఏ చాయ్ వాలా’ అని పెట్టాడు. దీంతో ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.
దీంతో ఓవర్ నైట్‌లో ఎంబీఏ చాయ్ వాలా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆదరణతో తన వ్యాపారాన్ని విస్తరించాడు. ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్‌ను నిర్వహిస్తున్నాడు. సంవత్సరానికి దాదాపు 5 కోట్లకుపైగా సంపాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రఫుల్ బిల్లోర్ తాజాగా ఓ ఖరీదైన కారు కొన్నాడు. మెర్సెడెస్ బెంజ్ ఎస్‌యూవీ లగ్జరీ కారును ఖరీదు చేశాడు. దీని ధర అక్షరాలా 92 లక్షల రూపాయలు. కారు కొన్న సందర్భంగా భార్య, కుమారుడితో తీసుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఎంబీఏ చాయ్ వాలా 92 లక్షల రూపాయల కారు కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.