ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు తరుచూ చూస్తుంటాం. రోడ్డు పై వెళ్తున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. దుకాణ సముదాయాల్లో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం చూస్తూనే ఉన్నాం.
దేశ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని బస్మండి లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ సముదాయంలో పలు కాంప్లెక్స్ లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 500 బట్టల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో వ్యాపాస్తులు లబోదిబో అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్ లోని బస్మండీ ఏరియాలో ఏఆర్ టవర్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 500 పైగా బట్టల దుకాణాలు దగ్దమయ్యాయి. ఇందులో ఉన్న దుస్తులు, వస్తువులు మంటల్లో పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఈద్ సీజన్ సందర్భంగా ఎక్కువగా బట్టల వ్యాపారం కొనసాగుతుందని.. ఈ నేపథ్యంలోనే నిల్వ ఉంచిన స్టాక్ మొత్తం కాలి బూడిద అయ్యిందని వ్యాపారస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సాధారణంగా దుస్తులు, కార్డ్ బోర్డ్, పేపర్ లాంటి వస్తువులకు వెంటనే మండే స్వభావం ఉండటం వల్ల ఈ ప్రమాదంలో మంటలు త్వరగా వ్యాపించాయి.
ఏఆర్ టవర్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది 25 ఫైరింజన్లతో మంటలను ఆర్పే అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. తాము సంఘటన స్థలానికి వచ్చే సమయానికే వందలాది వందలాది దుకాణాలు కాలి బూడిద అయ్యాయని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం సంబవించిన సమయంలో గాలి ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల.. ఏఆర్ టవర్ లో మంటలు వ్యాపించాయని యూపీ గార్మెంట్స్, మర్చంట్ ప్రధాన కార్యదర్శి గుర్జీందర్ సింగ్ అనే వ్యక్తి తెలిపారు.
UP | A massive fire broke out during the early hours today in AR Tower in the Basmandi area in Kanpur
The fire is under control now. No person trapped in the building: Ajay Kumar, Deputy Director, UP Fire Service pic.twitter.com/23TNshud5S
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 31, 2023