ప్రపంచంలో మొన్నటి వరకు కరోనా భయపెడితే ఇప్పుడు భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ఏడాది టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప కారణంగా 50 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ మద్య కాలంలో ప్రకృతి మనిషిపై భూకంపం రూపంలో పగబట్టిందా అనిపించేలా పలు చోట్ల భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపం వస్తుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ సంవత్సరం టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. 50 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా ఆ విషాదఛాయలు మరువకముందే ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల భూకంపాలు భారత్, జపాన్, ఇండోనేషియా, నేపాల్ లో ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదు అయ్యింది. వివరాల్లో కి వెళితే..
ఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళన కలిగించింది. జవా ద్వీపానికి ఉత్తరాన ఉన్న సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం ప్రకటించింది. సముద్రంలో 594 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం 4.55 గంటలకు ఇక్కడ బలమైన భూకంపం సంభవించిందని పేర్కొన్నారు అధికారులు. అయితే ఈ భూకంపం ప్రభావం వల్ల సునామీ వస్తుందని మీడియాలో వస్తున్న వార్తలను ఇండోనేషియా జియోలాజికల్ ఏజేన్సీ కొట్టిపడేసింది. సునామీ హెచ్చరికలను తోసిపుచ్చింది. భూకంప ప్రభావం వల్ల భూమి ఒక్కసారే కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇటీవల ఇండోనేషియాలో పలుమార్లు భూకంపం ప్రజలను భయపెడుతూనే ఉంది. నెలలో ఒకటీ రెండు సార్లు ఇక్కడ భూమి కంపిస్తుంది. కాకపోతే ఇటీవల వచ్చిన భూకంపాల వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న గురువారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. స్థానిక కాల మానం ప్రకారం తెల్లవారు జామున 4.37 నిమిషాలకు మలుకు ప్రావిన్స్ లో భూమి కంపించింది. దీని రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.9 గా నమోదు అయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
BREAKING: Indonesia authorities say earthquake has no tsunami potential
— The Spectator Index (@spectatorindex) April 14, 2023