ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకో కొందరికి కళ్లు నెత్తికెక్కుతాయి. ఇక తాము సామాన్య ప్రజలకు అతీతులమని.. తమ మాటే వేదం అని నమ్ముతారు. తమల్ని తాము దైశాంశ సంభూతులుగా భావిస్తుంటారు. అంతటితో ఆగక.. గోడు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులను మరింత ఇబ్బందికి గురి చేస్తుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బిహార్‌లో చోటు చేసుకుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చిన మహిళ చేత మసాజ్ చేయించుకున్నాడు ఓ పోలీసు సీనియర్ అధికారి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Lemon: నిమ్మకాయ కోసం ఇంటి కోడల్ని చంపేశారు!
బిహార్ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాహర్ అవుట్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సీనియర్ అధికారి శశిభూషణ్ సిన్హా.. మసాజ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను అవుట్‌పోస్ట్‌లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడాయన. ఆపై ఆమెతో బలవంతంగా మసాజ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సదరు అధికారి షర్ట్ విప్పి.. అక్కడే వేలాడదీసి.. ఆపై ఆమెతో ఒళ్లు రుద్దించుకున్నాడు. ఆ టైంలో ఆయన సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతుండగా.. ఎవరో ఆయన్ని వీడియో తీశారు. ఆ టైంలో అక్కడ మరో మహిళ కూడా ఉంది.
ఇది కూడా చదవండి: 28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్దోషిగా తేల్చిన కోర్టు.. ఇప్పుడతని పరిస్థితి ఏంటి!
ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సిన్హాపై వేటు వేయాల్సిందిగా డిమాండ్స్ వెల్లువెత్తడంతో.. ఉన్నతాధికారులు స్పందించారు. సదరు అధికారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే బిహార్ పోలీస్ శాఖ ఈ వీడియోపై, ఘటనపై, చర్యలపై అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.
Bihar police exposed on camera!
Woman forced to give massage to cop to secure release of her son.
Aditya joins us with details. #Bihar pic.twitter.com/8KNWWpZ9Ez
— TIMES NOW (@TimesNow) April 29, 2022
ఇది కూడా చదవండి: ఇలాంటి దొంగతనం గురించి ఎప్పుడు విని ఉండరు!