ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘటన. ఈ వేడుకను జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు మంచి ముహూర్తం చూసుకుంటారు. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల మూహూర్తం సమీపిస్తోంది. దేశమంతా పెళ్లిబాజాలు ప్రారంభమయ్యాయి. ఏ ఊరిలో.. ఏ మూలన చూసినా పెళ్లి సందడి కనిస్తోంది. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో భారీగా పెళ్లిలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వర్తకుల సమఖ్య పలు ఆసక్తికర మైన విషయాలను వెల్లడించింది. నవంబరు 4 నుంచి డిసెంబరు 14 మధ్య సుమారు 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు అఖిల భారత వర్తకు సమఖ్య అంచనా కట్టింది. నిన్న మొన్నటివ వరకు దసరా, దీపావలి వంటి ఫెస్టివల్ సీజన్ జరిగాయి. తాజాగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నెల పెళ్లిళ్లకు అనువైన మంచి ముహూర్తం కావడంతో భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ నెలరోజుల్లో జరగనున్న పెళ్లిల ఖర్చులు ఎన్ని కోట్లు ఖర్చు కానుందో తెలిస్తే..నోరెళ్లబెట్టేయడం ఖాయం. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…
నవంబరు 4 నుంచి డిసెంబరు 14 మధ్య సుమారు 32 లక్షల వివాహాలు జరగనున్నట్లు సమాచారం. వీటిపై రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆ సమఖ్య పేర్కొంది. అయితే గత ఏడాది ఇదే సమయంలో సుమారు 25 లక్షల పెళ్లిళ్లు, రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిపింది. తమ బృందం నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వారు తెలిపారు. సుమారు 35 నగరాల్లో 4302 మంది వ్యాపారులు, సేవా సంస్థల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ నివేదికను విడుదల చేసినట్లు వారు వెల్లడించారు. కేవలం దిల్లీ ప్రాంతంలోనే 3.5 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని, వీటిపై సుమారు రూ.75 వేల కోట్ల వ్యాపారం జరగవచ్చని వర్తక సమఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్ వాల్ తెలిపారు.
నవంబరు 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఎక్కువగా ముహూర్తాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ తరువాత కొద్దికాలం పెళ్లిళ్లకు బ్రేక్ ఉంటుందని తరువాత జనవరి 14 నుంచి జులై వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం పుంజుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు తమ ఏర్పాట్లలో మునుగుతున్నారు. ఎందుకంటే దీపావళికి రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. పెళ్లిళ్లలో ఏ విభాగానికి ఎంత ఖర్చు కానుందనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. పెళ్లి వేడుక మొత్తంలో 20 శాతం ఖర్చు వధువరులపై ఉంటుందని అంచనా. మిగిలిన 80 శాతం ఖర్చు పెళ్లి నిర్వహణకు ఉంటుంది కొందరు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.