వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. అప్పటి వరకు మనతో ఆడిపాడిన వ్యక్తులు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. తాజాగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.
అప్పటి వరకు నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. గేమ్స్ ఆడుతూ, పని చేస్తూ, డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
గుజరాత్ భావ్ నగర్ జిల్లా ఘోఘా ప్రాంతంలో భువా మకాభాయ్ (65) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు తాజాగా ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆ వ్యక్తి ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇకపోతే అతడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇక ఏం జరిగిందని అక్కడికి వచ్చి చూడగా.. అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.. అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 28, 2023