అది చెన్నైలో రాష్ట్రంలోని టీపీ చత్రం ప్రాంతం. పెరుమాళ్ (40) అనే వ్యక్తి ఒక కిరాణ దుకాణం నడుపుతూ తన జీవినాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతని బాగోతం ఇంతటితో బాగానే ఉన్నా..తెర వెనుకాల ఓ భారీ కుట్రకు ప్లాన్ చేశాడు. దుకాణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నాడనే సమాచారంతో అతడిని అరెస్ట్ చేశారు. దీంతో అతని మోబైల్ ఫోన్ లో తీసుకుని విచారిస్తుండగా మనోడి బాగోతం, నమ్మలేని నిజాలు పోలీసుల కళ్ల ముందు దర్శనమిచ్చాయి.
తీగ లాగితే డొంక కదిలినట్లుందీ వ్యవహారం. సాధారణ కిరాణ షాపు నడుపతున్న పెరుమాళ్ తెర వెనుకాల అమ్మాయిలను లైంగికంగా వేదిస్తూ అత్యాచారాలకు పాల్పడ్డాడు..ఆపై అలా తీసుకున్న 50 వీడియోలను చూసిన పోలీసులకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. ఏంటని ఆరా తీస్తే అసలు విషయాలు, ఖంగుతినే సమాచారం మనోడు పుసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. దుకాణంలోకి అడుక్కోవటానికి వచ్చిన బాలికలను, ఉచిత సరుకుల పేరుతో లైంగికంగా లోబరుచుకున్నానని తెలిపాడు.
అలా దాదాపుగా ఐదుగురి యువతులపై శారీరక కోరికలు తీర్చుకుని ఆపై వీడియోలు తీసుకున్నాడు. అలా తీసుకున్న వీడియోలను తన ఫ్రెండ్స్ కు పంపించుకున్నాడీ కామ పిశాచి. ఇక ఈ దారుణ వ్యవహారంలో తన సొంత అక్కా చెల్లెల్ల పాత్ర కూడా ఉందని తేలింది. తన అక్కా చెల్లెల్ల కూతుళ్లను కూడా వదలకుండా లొంగదీసుకుని ఇందులోకి లాగి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక దీనిపై పెరుమాళ్, అతనికి సహకరించిన అక్కా చెలెల్లపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఇక బాదిత అమ్మాయిను చైల్డ్ హోమ్ కు తరలించారు. ఇక ఇలాంటి కామ పిశాచి తీరును ఎండగడుతూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.