పెద్దల సాక్షిగా వివాహబంధంతో ఒక్కటైన జంట ఏడాదిలోనే మనస్ఫర్ధలు రావడంతో విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తల మద్య గొడలు రావడం.. కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయ్యింది. భార్యాభర్తలు ఎక్కువగా విడిపోవడానికి గల కారణం వివాహేతర సంబంధాలు అని మానసిక నిపుణులు అంటున్నారు. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్తున్నారు. ఓ భర్త తన గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వచ్చాడు. అదే సమయంలో అతని భార్య చూసి ఇద్దరికీ బడితె పూజ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఘజియాబాద్ కి చెందిన భార్యాభర్తల మద్య గత కొంత కాలంగా మనస్ఫర్దలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం భార్య తన పుట్టింట్లో ఉంటుంది. ఇదే అదునుగా భర్త తన ప్రియురాలితో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ విషయం గురించి తెలిసిన భార్య వీరిద్దరు రెడ్ హ్యాండ్ గా ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో భర్త ఘజియాబాద్ లోని ఓ మార్కెట్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వచ్చాడు. అదే సమయంలో భార్య తన కుటుంబ సభ్యులతో షాపింగ్ కి వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ తో భర్తను చూసి కోపంతో భర్త కాలర్ పట్టుకొని చితకబాదింది. ఆ సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ ఆపే ప్రయత్నం చేయగా పక్కన ఉన్నవాళ్లు ఆమెపై దాడి చేశారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన భర్త తనను దూరం చేసి ప్రియురాలితో కలిసి తిరుగుతున్నాడని.. తనకు అన్యాయం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ప్రస్తుతం తాను తన తల్లిగారింట్లో ఉంటున్నాని.. డబ్బులు ఏమీ ఇవ్వడం లేదని ఆరోపించింది. కాగా, ఉత్తరాదిన హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే కర్వా చౌత్ పండగ రోజు తన కుటుంబ సభ్యులతో షాపింగ్ కి వచ్చింది.. అదే సమయంలో గర్ల్ ఫ్రెండ్ తో భర్త కనిపించడంతో కోపంతో ఉగిపోయి దాడి చేసింది. మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
करवा चौथ के दिन दूसरी महिला काे शॉपिंग करवाने आया था पति। पत्नी ने पकड़ा। https://t.co/T3jB1xVOWn pic.twitter.com/gSFGxGaghn
— Ankit tiwari/अंकित तिवारी (@ankitnbt) October 13, 2022