కదులుతున్న ఎక్స్ ప్రెస్ రైలులో ఒక మహిళ మీద పెట్రోల్ పోసి నిప్పటించాడో దుండగుడు. అనంతరం రైలులోంచి దూకి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు లోంచి దూకేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అయితే నిప్పు అంటుకోవడంతో మహిళ సహా చిన్నారి, మరో వ్యక్తి మరణించారు.
కదులుతున్న రైలులో ఒక దుండగుడు మహిళపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం రైలు లోంచి దూకేశాడు. మహిళను కాపాడే ప్రయత్నం చేయగా వారికి గాయాలు అయ్యాయి. ఆ తర్వాత భయంతో ప్రయాణికులు రైల్లోంచి దూకేశారు. ఈ ఘటనలో మహిళ, ఏడాది చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన కేరళలోని అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. రైలు కదులుతుండగా మహిళకు నిప్పు అంటించిన దుండగుడి గురించి కోజికోడ్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటన అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ రైలు కొరపుజ రైల్వే బ్రిడ్జికి చేరుకున్న తరవాత కోజికోడ్ సిటీ క్రాస్ చేసిన అనంతరం ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు జరిగింది. మహిళపై పెట్రోల్ పోసిన దుండగుడు నిప్పు అంటించి.. వెంటనే పారిపోయినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మహిళను రక్షించే ప్రయత్నం చేయగా ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
వెంటనే మిగతా ప్రయాణికులు రైలు అత్యవసర గొలుసుని లాగి గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. రైలు చైన్ లాగినప్పుడు రైలు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో దుండగుడు రైలు లోంచి దూకేసినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఇక రైలు కన్నూర్ స్టేషన్ చేరుకున్న తర్వాత మహిళ, చిన్నారి కనబడడం లేదని తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. గాయాల పాలైన వ్యక్తి.. మహిళను, చిన్నారిని వెతుక్కుంటూ వెళ్లగా రైల్వే ట్రాక్ మీద వారి పాదరక్షలు, సెల్ ఫోన్ కనిపించాయని ఆ వ్యక్తి మీడియాతో వెల్లడించారు. సిటీ పోలీసులు మిస్ అయిన వారిని కనుగొనేందుకు రైల్వే ట్రాక్ లను పరిశీలిస్తుండగా.. ఒక ట్రాక్ పై మూడు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల్లో ఒకటి మహిళది, మరొకటి పురుషుడిది కాగా రెండేళ్ల చిన్నారిది.
అయితే మంటలు చూసిన తర్వాత రైలులోంచి పడిపోవడం గానీ లేదా రైలు లోంచి దూకే ప్రయత్నం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వారిలో మత్తన్నుర్ నివాసి రహ్మత్, ఆమె సోదరి బిడ్డ సహారా, సౌఫీక్ లుగా గుర్తించారు. ఘటన జరిగిన సమీప ప్రాంతాల్లో సీసీటీవీ విజువల్స్ ని పరిశీలించిన పోలీసులు.. అనుమానితుడు యొక్క విజువల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విజువల్స్ లో అనుమానితుడు బైక్ పై వెళ్తున్నాడు. దుండగుడి వద్ద రెండు పెట్రోల్ బాటిల్స్ ఉన్నట్లు ప్రయాణికులు చెప్పడంతో.. ముందుగా ప్రణాళిక వేసుకుని చేసిన ఎటాక్ అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది ప్రయాణికులు ఆసుపత్రిలో చేరారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.